politics

శ్రీ ఛత్రపతి సాహు మహరాజ్ జయంతి ఘనంగా నిర్వహించిన_ పటాన్‌చెరు బహుజన్ సమాజ్ పార్టీ

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

మన దేశ చరిత్రలో వందేళ్లుగా గుర్తింపు ఉన్నవాడు చత్రపతి సాహు మహారాజ్ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని పటాన్చెరువు బహుజన్ సమాజ్ పార్టీ నియోజకవర్గ కమిటీ అధ్యక్షుడు శ్రీశైలం ఆన్నారు.చత్రపతి సాహు మహారాజ్ జయంతిని పురస్కరించుకొని రామచంద్రాపురంలో ని అంబేద్కర్ విగ్రహం దగ్గర చత్రపతి సాహు మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం పటాన్చెరువు బహుజన్ సమాజ్ పార్టీ నియోజకవర్గ కమిటీ అధ్యక్షుడు శ్రీశైలం మాట్లాడుతూ చత్రపతి శివాజీ వారసుడిగా కృషిచేసి ప్రజాస్వామిక తాత్విక పునాది  ఏర్పరిచి ప్రజలకు రారాజుగా మిగిలిపోయిన మహనీయుడని వెనుకబడిన కులంలో పుట్టి సామాజిక ఉద్యమకారుడు అయ్యాడని కేవలం మహారాష్ట్ర కే కాకుండా దక్షిణ భారతంలో జస్టిస్ పార్టీ ఉద్యమంతో పాటు దేశం మొత్తం మీద ప్రభావం చూపిన సాహూ మహారాజ్ ఒక్కడే అని అన్నారు.ఛత్రపతి సాహు మహరాజ్ స్పూర్తితో బీసీలకు చట్ట సభల్లో 60 నుండి 70 సీట్ల వరకు ప్రాతినిధ్యం కల్పించబోయే పార్టీ కేవలం బీఎస్పీ మాత్రమే అని శ్రీశైలం అన్నారు. ఈ కార్యక్రమంలో ఇంఛార్జి సంజీవ్, వైస్ ప్రెసిడెంట్ నర్సింగ్ రావు, జనరల్ సెక్రటరీ,ప్రశాంత్, రమేష్, నర్సింహా,ఇస్నాపుర్ సెక్టార్ నాయకులు షేక్ ఫరీద్, జనార్ధన్, యేసు, తెల్లాపూర్ సెక్టార్, సునీల్ పాల్గొన్నారు.

 

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago