– ఎమ్మెల్యే తనయుడు గూడెం విష్ణువర్ధన్ రెడ్డి మృతి
– నివాళులర్పించిన మంత్రులు మహమ్మద్ అలీ, హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి
– అందరిని తీవ్రంగా కలిసి వేసిన ఎమ్మెల్యే జీఎంఆర్ అర్ధనాథాలు
పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :
పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పుత్రశోకంలో మునిగిపోయారు. అనారోగ్యంతో ఎమ్మెల్యే పెద్ద కుమారుడు గూడెం విష్ణువర్ధన్ రెడ్డి (35) గురువారం ఉదయం హైదరాబాద్ లోని కాంటినెంటల్ ఆస్పత్రిలో మృతి చెందాడు. కుమారుడి మరణంతో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తో పాటు కుటుంబ సభ్యుల రోదనలు అందరిని తీవ్రంగా కలచి వేస్తున్నాయి. ఆయన మృతితో పటాన్ చెరులో తీవ్ర విషాదఛాయలు నెలకొన్నాయి. అందరితో కలిసి మెలిసి ఉంటూ ఆప్యాయంగా పలకరించే విష్ణువర్ధన్ రెడ్డి మరణ వార్తతో సన్నిహితులు, స్నేహితులు బంధుమిత్రులు కన్నీరు పెట్టుకుంటున్నారు. పటాన్ చెరు నియోజకవర్గ ప్రజలు దుఃఖ సాగరంలో మునిగిపోయారు. మృతుడికి భార్య కిరణ్మయితో పాటు ఒక కుమారుడు, కూతురు ఉన్నారు. అలాగే సాయంత్రం నాలుగు గంటలకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి సంబంధించిన సొంత స్థలం జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్ పక్కన అంత్యక్రియలు నిర్వహించారు. మృతుడు గూడెం విష్ణువర్ధన్ రెడ్డి పార్థివ దేహానికి తండ్రి గూడెం మహిపాల్ రెడ్డి అంత్యక్రియలు నిర్వహించారు.
అంత్యక్రియల్లో రాష్ట్ర మంత్రులు మహమ్మద్ అలీ, తన్నీరు హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ వెన్నవరం భూపాల్ రెడ్డి, మహిళా కార్పొరేషన్ చైర్మన్ సునీత లక్ష్మారెడ్డి, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్, జిల్లా ఎమ్మెల్యేలు భూపాల్ రెడ్డి, క్రాంతి కిరణ్, మదన్ రెడ్డి, మాణిక్ రావు, జిల్లా కలెక్టర్ శరత్, ఎస్పీ రమణ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు చింత ప్రభాకర్, కుర్ర సత్యనారాయణ, నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, అభిమానులు, శ్రేయోభిలాషులు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…
చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజల…
రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…