సీసీ రోడ్డు రోడ్డు పనులకు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి శ్రీకారం

మనవార్తలు ప్రతినిధి,తెల్లాపూర్ : రామచంద్రపురం మండలం తెల్లాపూర్ డివిజన్ ఉస్మాన్ నగర్‌లోని సైబర్ కాలనీ బి మ్యాథ్స్‌లో రూ.7 లక్షల వ్యయంతో 100 మీటర్ల సీసీ రోడ్డు నిర్మాణ పనులను పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. మాజీ కౌన్సిలర్ చిట్టి ఉమేష్ సొంత నిధులతో ఈ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టారు. అనంతరం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి పనులు కొనసాగిస్తామని తెలిపారు. […]

Continue Reading

మాదాపూర్‌లో పకోడా హబ్‌ను ప్రారంభించిన సినీనటుడు వెంకట్

మనవార్తలు ప్రతినిధి,హైదరాబాద్: ఫుడ్ లవర్స్‌కు సరికొత్త రుచులను పరిచయం చేస్తూ మాదాపూర్‌లో మరో ప్రత్యేకమైన ఫుడ్ డెస్టినేషన్ అందుబాటులోకి వచ్చింది. వేడివేడిగా తయారుచేసి, కరకరలాడే క్రిస్పీ టెక్స్చర్‌తో పాటు మసాలా, స్పైసీ ఫ్లేవర్స్‌తో నోరూరించే వంటకాలను అందించే పకోడా హబ్ రెస్టారెంట్ తాజాగా ప్రారంభమైంది. దుర్గం చెరువు మెట్రో స్టేషన్ కింద, మాదాపూర్‌లో ఏర్పాటు చేసిన ఈ రెస్టారెంట్‌ను ఆదివారం సినీనటుడు వెంకట్ ప్రారంభించారు.పకోడా హబ్‌లో ప్రతి బైట్‌లోనూ క్రిస్పీ టెక్స్చర్, మసాలా ఫ్లేవర్, స్పైసీ టచ్ […]

Continue Reading

గీతం పూర్వ విద్యార్థిని మేఘనా రెడ్డికి రెండు జాతీయ మానవతా పురస్కారాలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భారతదేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలో జరిగిన జాతీయ మానవతా సదస్సు, అవార్డులు 2026లో రెండు ప్రతిష్టాత్మక పురస్కారాలను హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థిని మేఘనా రెడ్డి కొల్లి అందుకున్నారు.సుస్థిర అభివృద్ధి, ప్రజా సంక్షేమం, సమాజ పరివర్తనకు ఆమె చేసిన కృషికి గాను మేఘనకు ‘యంగ్ సోషల్ వర్కర్ ఆఫ్ ది ఇయర్’ పురస్కారం ప్రదానం చేశారు. ఆమె సంస్థ, ఎంఆర్ ఫ్యూచర్ ఫౌండేషన్ (ఎం.ఆర్.ఎఫ్.ఎఫ్), ‘బెస్ట్ ఎన్జీవో ఆఫ్ […]

Continue Reading

కార్మికుల సమస్యల కోసం నిరంతర పోరాటం సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు కే రాజయ్య,పి పాండురంగారెడ్డి

సిఐటియు ఉంటేనే కార్మికులకు సమ న్యాయం పోరాటాల, త్యాగాల చరిత్ర సిఐటియుది యజమాన్యాలకు లొంగని సంఘం సిఐటియు జేకే పెన్నార్ లో ఎగిరిన సిఐటియు జెండా మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: కార్మికుల సమస్యల కోసం సిఐటియు నిరంతరం పోరాటం చేస్తుందని సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు కే రాజయ్య,పి పాండురంగారెడ్డి లు అన్నారు.పటాన్ చెరు పారిశ్రామిక ప్రాంతంలోని జెకె ఫెన్నార్ పరిశ్రమ వద్ద శనివారం సిఐటియు జెండాను యూనియన్ అధ్యక్షులు సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు కే రాజయ్య […]

Continue Reading

అబద్ధపు కేసుల తీరుతెన్నులపై సదస్సు

రెండు రోజుల సమావేశాన్ని నిర్వహించిన గీతం కౌటిల్యా స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: అబద్ధపు కేసుల తీరుతెన్నులను పరిశీలించి, తగిన మార్గదర్శనం చేసేందుకు గాను హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన కౌటిల్యా స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ (కె.ఎస్.పి.పి.) ఆగస్టు 21-22 తేదీలలో రెండు రోజుల జాతీయ సదస్సును నిర్వహించింది. యుగాంతర్, ఇంటర్నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐ ఐటీ) హైదరాబాద్, భూమిక ఉమెన్స్ కలెక్టివ్ సంయుక్త సహకారంతో నిర్వహించిన […]

Continue Reading

పింక్ గులాబ్ – ది హెరిటేజ్ ఎడిట్ ను ప్రారంభించిన నటి అమల అక్కినేని

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ :  భారతదేశ సంప్రదాయ చేనేతలు, వస్త్ర కళలు, హస్తకళలు, కళాకారుల నైపుణ్యాన్ని ప్రతిబింబించే ప్రత్యేక ప్రదర్శన *‘పింక్ గులాబ్ – ది హెరిటేజ్ ఎడిట్’* హైదరాబాద్‌లో తొలిసారిగా నిర్వహిస్తున్నారు. ఈ ప్రదర్శనను ప్రముఖ నటి, సామాజిక వ్యాపారవేత్త, పర్యావరణవేత్త అమల అక్కినేని ప్రారంభించారు.దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సంప్రదాయ చేనేతలు, హ్యాండ్ ఎంబ్రాయిడరీ, సిల్క్ వస్త్రాలు, కళాత్మక ఉత్పత్తులు, హస్తకళా వస్తువులు ఇందులో కొలువుదీరనున్నాయి.ఈ సందర్భంగా అమల అక్కినేని మాట్లాడుతూ భారతీయ హస్తకళల్లో […]

Continue Reading

ఇస్నాపూర్ మున్సిపల్ సమగ్ర అభివృద్ధే మా లక్ష్యం

ప్రతి కాలనీలో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత రుద్రారం, పాశంమైలారం, చిట్కుల్ వార్డుల్లో రూ.2.70 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ఇస్నాపూర్ మున్సిపాలిటీని అన్ని రంగాల్లో సమగ్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి కాలనీలో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను కల్పించేందుకు ప్రత్యేక ప్రణాళికతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు.శుక్రవారం ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని రుద్రారం, పాశం […]

Continue Reading

డిజిటల్ టెక్నాలజీల ఏకీకరణతో కార్యాచరణ సామర్థ్యాన్ని పెంచొచ్చు

ఐఎన్ఎస్ విశ్వకర్మలో ఏఐ-ఆధారిత నావికా ఇంజనీరింగ్ పై గీతం ప్రొఫెసర్ ప్రసంగం మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: డిజిటల్ టెక్నాలజీల ఏకీకరణ ద్వారా తెలివైన సముద్ర వ్యవస్థలను ఎలా ఏర్పాటు చేయవచ్చో, కార్యాచరణ సామర్థ్యాన్ని ఎలా పెంచవచ్చో, వేగవంతమైన, మరింత సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకోవడానికి ఎలా తోడ్పడగలదో ప్రొఫెసర్ ప్రీతి పర్వేకర్ వివరించారు. హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, కంప్యూటర్ సైన్స్ అండ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ ప్రీతి, భారతీయ యుద్ధ నౌక ఐఎన్ఎస్ విశ్వకర్మలో ‘ఏఐ-ఆధారిత […]

Continue Reading

ఆధునిక సాంకేతిక విప్లవానికి ఆద్యుడు రాజీవ్ గాంధీ మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి నీలం మధు ముదిరాజ్

దేశం కోసం ప్రాణాలర్పించిన ఘనత ఆ మహానీయుడి సొంతం చిట్కుల్ లో ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు  మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ఆధునిక సాంకేతిక విప్లవానికి ఆద్యుడు, టెలికాం రంగంలో సరికొత్త సంస్కరణలు తెచ్చి భారత దేశాన్ని టెక్నాలజీలో పరుగులు పెట్టించిన మహా ఘనత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి దక్కుతుందని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి నీలం మధు ముదిరాజ్ అన్నారు.మంగళవారం రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకొని చిట్కుల్ లోని ఎన్ఎంఆర్ క్యాంపు కార్యాలయంలో […]

Continue Reading

సిగాచి బాధితులకు ఈపీఎఫ్, ఈడి ఎల్ ఐ , ఈఎస్ఐ ప్రయోజనాలు వెంటనే అందించాలి – టి పి జే ఏ సి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిగాచి ఇండస్ట్రీస్ ప్రమాదం జరిగి 13 నెలలు గడిచినా, పలువురు బాధిత కుటుంబాలకు ఇంకా ఈపీఎఫ్ , ఈఎస్ఐ ప్రయోజనాలు అందలేదని తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ సంగారెడ్డి జిల్లా కమిటీ పేర్కొంది.ఈ నేపథ్యంలో టి పి జే ఏ సి జిల్లా ప్రతినిధులు పటాన్‌చెరు ఈఎస్ఐసి కార్యాలయాలను సందర్శించి, సంబంధిత అధికారులను కలిసి వినతిపత్రాలు సమర్పించారు. ఈపీఎఫ్, ఈడి ఎల్ ఐ ప్రయోజనాలు పెండింగ్‌లో ఉన్న 13 మంది బాధితుల జాబితాను […]

Continue Reading