Telangana

రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే మా లక్ష్యం

* రాహుల్ గాంధీ నాయకత్వంలో దేశానికి నూతన దిశ: నీలం మధు

* దేశ ఐక్యత కోసం కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు సుదీర్ఘ పాదయాత్ర చేపట్టడం అభినందనీయం

* 1,500 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర పూర్తి చేసిన కాటూరి వెంకటేశ్వర్లుకు పటాన్‌చేరులో ఘన స్వాగతం

* ⁠పాదయాత్రలో పాల్గొని ముత్తంగి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన నీలం

మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు:

భారతదేశం కోసం ఎన్నో త్యాగాలు చేసి ప్రజా సమస్యలపై నిరంతరం పాటుపడుతున్న గాంధీ కుటుంబం వారసుడు రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా పాదయాత్ర చేపట్టడం గొప్ప విషయమని ప్రతి కార్యకర్త రాహుల్ ను ప్రధాని చేసేందుకు కృషి చేయాలని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి నీలం మధు ముదిరాజ్ అన్నారు.దేశ ఐక్యత, సామాజిక న్యాయం, సమ్మిళిత అభివృద్ధి లక్ష్యంగా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు కొనసాగుతున్న జాతీయ పాదయాత్ర బుధవారం పటాన్‌చేరు నియోజకవర్గానికి చేరుకుంది. ప్రకాశం జిల్లాకు చెందిన న్యాయవాది, సామాజిక కార్యకర్త కాటూరి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ పాదయాత్రకు మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి నీలం మధు ముదిరాజ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ముత్తంగి పుట్టి రింగ్ రోడ్ వద్ద ఘన స్వాగతం పలికారు అక్కడి నుంచి ముత్తంగి డివిజన్ పరిధిలోని పీఎస్ఆర్ గార్డెన్స్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కాటూరి వెంకటేశ్వర్లును శాలువాతో సత్కరించి అభినందించారు.

కాటూరి వెంకటేశ్వర్లు గత జూన్ 19న కన్యాకుమారి నుంచి తన పాదయాత్రను ప్రారంభించారు. తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల మీదుగా ఇప్పటివరకు 1,500 కిలోమీటర్లకు పైగా కాలినడకన ప్రయాణించి తెలంగాణలోని పటాన్‌చేరు నియోజకవర్గానికి చేరుకున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రజలను కలుసుకుంటూ వారి సమస్యలు, అభిప్రాయాలు, ఆకాంక్షలను తెలుసుకుంటూ యాత్రను కొనసాగిస్తున్నారు.ఈ సందర్భంగా నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ దేశ భవిష్యత్తుకు ప్రజల ఆకాంక్షలకు అనుగుణమైన నాయకత్వం అవసరమని అన్నారు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకోవడం, అన్ని వర్గాలను కలుపుకొని ముందుకు సాగడం ప్రజాస్వామ్యానికి ఎంతో ముఖ్యమని అన్నారు.దేశంలో యువతకు ఉపాధి అవకాశాలు, రైతులకు భరోసా, మహిళలకు సమాన అవకాశాలు, పేదలకు సామాజిక భద్రత, ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు కల్పించాలనే ఆలోచనలతో ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. దేశ ఐక్యత, సోదరభావం, సామాజిక న్యాయం కోసం ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు.

కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు వేల కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించడం సాధారణ విషయం కాదని, ప్రజల సమస్యలను తెలుసుకోవాలనే సంకల్పంతో ఇంత సుదీర్ఘ ప్రయాణాన్ని చేపట్టిన కాటూరి వెంకటేశ్వర్లును అభినందిస్తున్నామన్నారు. ఎండ, వర్షం, అనేక ఇబ్బందులను ఎదుర్కొంటూ పాదయాత్రను కొనసాగించడం గొప్ప విషయమని కొనియాడారు.దేశంలోని అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా ముందుకు సాగినప్పుడే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో జిల్లా ఐఎన్ టీయూసి జిల్లా అధ్యక్షులు కొల్కురి నర్సింహారెడ్డి, కౌన్సిలర్స్ గోపాల్ రెడ్డి, దస్తగిరి, మన్నే రాఘవేంద్ర, సంపత్ రెడ్డి, నారాయణదాసు, మణికంఠ, సందీప్ గౌడ్, మాజీ సర్పంచులు రాజి రెడ్డి, సుంకరి రవీందర్, జగన్, సీనియర్ నాయకులు ముత్తంగి అశోక్, మధు పంతులు, గడ్డ యాదయ్య, షాపురం నరసింహారెడ్డి, రుద్రారం లక్ష్మారెడ్డి , దండోరా నర్సింహ, గోపాలకృష్ణ, లక్దారం లక్ష్మ రెడ్డి, సంజీవ, సందీప్ యాదవ్, మైలారం శ్రీను, పాండు, శంకర్, ప్రకాష్ రాథోడ్, ప్రవీణ్, రంజిత్, రాజ్ గోపాల్,కాంగ్రెస్ నాయకులు శ్రేణులు పెద్దఎత్తున పాల్గొన్నారు..

admin

Recent Posts

నందిగామ సర్పంచ్ విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో రుద్రారం గణేష్ గడ్డ వరకు పాదయాత్ర

భక్తుల సౌకర్యార్థం సొంత నిధులతో రోడ్డు నిర్మాణం ఐదు లక్షల రూపాయలు అందజేత విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదానం  భక్తులకు…

38 minutes ago

రుద్రారం శ్రీ గణేష్ దేవస్థానంలో వైభవంగా బ్రహ్మోత్సవాలు

విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదానం భక్తులకు స్వయంగా అన్నప్రసాదం వడ్డించిన కాట శ్రీనివాస్ గౌడ్ దంపతులు మనవార్తలు ప్రతినిధి ,పటాన్…

1 hour ago

పర్యావరణ శాస్త్రంలో కెజియా ఎలిజబెత్ కు పీహెచ్.డీ

మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, పర్యావరణ శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని ఎం.…

7 hours ago

సేవా కార్యక్రమాలతో జీఎంఆర్ జన్మదిన వేడుకలు

-పరమేష్ యాదవ్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ -ఈఎస్ఐ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : పటాన్‌చెరు…

19 hours ago

రామచంద్రాపురంలో ఘనంగా ఎమ్మెల్యే జిఎంఆర్ జన్మదిన వేడుకలు

-ఐలేష్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ -ఈఎస్ఐ ఆస్పత్రిలో రోగులకు పండ్ల పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం…

19 hours ago

పూరి బీచ్‌పై మెరిసిన ఎమ్మెల్యే జిఎంఆర్ సైకత శిల్పం

ఎమ్మెల్యే జన్మదినానికి అభిమానుల వినూత్న కానుక అభిమానానికి ప్రతి రూపంగా ప్రత్యేక బహుమతి అందించిన బిఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకుడు…

20 hours ago