గీతం హైదరాబాదులో ఆకట్టుకున్న బోధనేతర సిబ్బంది సాంస్కృతిక ఉత్సవం
మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు:
గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని విద్యాపరమైన ఆవిష్కరణ, పురోగతి కేంద్రం (సీఏఐఏ), బోధనేతర సిబ్బంది (ఎన్.టి.ఎస్)లలో ప్రతిభ, సృజనాత్మకత, సామూహిక స్ఫూర్తిని చాటిచెప్పే ఒక ఉత్సాహభరితమైన వేడుక అయిన ఎన్.టి.ఎస్. సాంస్కృతిక ఉత్సవం 2026ను బుధవారం నిర్వహించింది. ఈ కార్యక్రమాన్ని హైదరాబాదు అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డి.ఎస్. రావు ప్రారంభించారు. విశ్వవిద్యాలయం యొక్క అభివృద్ధి చెందుతున్న ప్రమాణాలు, ఆకాంక్షలకు అనుగుణంగా, సిబ్బంది తమ నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలని, వృత్తిపరమైన అభివృద్ధిని స్వీకరించాలని, ఇంకా అధిక సామర్థ్యం కోసం కృషి చేయాలని ప్రోత్సహించారు.గీతం మూడు ప్రాంగణాలలో బోధనేతర సిబ్బంది అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా, ఉద్యోగులు తమలో దాగి ఉన్న ప్రతిభను ప్రదర్శించడానికి, సహోద్యోగులతో మమేకమవ్వడానికి, మరింత భాగస్వామ్యం, సహకారం, స్నేహభావాన్ని పెంపొందించుకోవడానికి సీఏఐఏ ఒక వేదికను సృష్టించింది.ఈ కార్యక్రమంలో పలువురు బోధనేతర సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. అత్యుత్తమ ప్రదర్శనలు కనబరిచిన వారికి జ్జాపికలు, గుర్తుండిపోయే బహుమతులు అందజేశారు. ‘రండి, ప్రదర్శించండి, వేడుక జరుపుకోండి, స్ఫూర్తినివ్వండి’ అనే ఈ ప్రత్యేకమైన, ఆనందదాయకమైన వేదికను సృష్టించినందుకు సీఏఐఏకు సిబ్బంది కృతజ్జతలు తెలియజేశారు.
భక్తుల సౌకర్యార్థం సొంత నిధులతో రోడ్డు నిర్మాణం ఐదు లక్షల రూపాయలు అందజేత విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదానం భక్తులకు…
విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదానం భక్తులకు స్వయంగా అన్నప్రసాదం వడ్డించిన కాట శ్రీనివాస్ గౌడ్ దంపతులు మనవార్తలు ప్రతినిధి ,పటాన్…
మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, పర్యావరణ శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని ఎం.…
-పరమేష్ యాదవ్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ -ఈఎస్ఐ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : పటాన్‌చెరు…
-ఐలేష్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ -ఈఎస్ఐ ఆస్పత్రిలో రోగులకు పండ్ల పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం…
ఎమ్మెల్యే జన్మదినానికి అభిమానుల వినూత్న కానుక అభిమానానికి ప్రతి రూపంగా ప్రత్యేక బహుమతి అందించిన బిఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకుడు…