Telangana

ఇందిరమ్మ స్ఫూర్తి పాలనలో అన్ని వర్గాలకు సమన్యాయం_కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు నీలం మధు ముదిరాజ్

_ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటును స్వాగతిస్తున్నాం..

_ముదిరాజులమంత కాంగ్రెస్ కి రుణపడి ఉంటాం ..

_17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకుంటాం..
 
_సీఎం రేవంత్ చిత్రపటానికి పాలాభిషేకం 

16 కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు నీలం మధు ముదిరాజ్ అన్నారు.
16 కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం హర్షిస్తూ చిట్కుల్ లోని తన క్యాంపు కార్యాలయంలో రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ ఇందిరమ్మ స్ఫూర్తితో రాష్ట్రంలో పాలన కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తున్నారన్నారు. 16 కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం ద్వారా ఆయా కులాల వారందరికీ చేయూత దొరుకుతుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 16 కులాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ తీసుకున్న నిర్ణయన్ని తెలంగాణ సమాజం స్వాగతిస్తుందన్నారు. ముదిరాజ్ కులస్తుల చిరకాల స్వప్నమైన ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు ప్రభుత్వానికి రుణపడి ఉంటామన్నారు.

తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సమయంలో ఏఐసీసీ ఇంచార్జి దీపా దాస్ మున్షీ తో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటుతోపాటు బీసీడీ నుంచి బీసీఏలోకి మార్చలని విన్నవించడం జరిగిందన్నారు. ఈ విషయంలో సానుకూలంగా స్పందించిన వారిద్దరూ స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలోనే 16 కార్పొరేషన్ ల ఏర్పాటులో ముదిరాజ్ కులానికి సైతం కార్పొరేషన్ ఏర్పాటు చేశారని స్పష్టం చేశారు.ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటుతో ముదిరాజ్ కులస్తులకు సామాజికంగా ఆర్థికంగా న్యాయం జరుగుతుందని తెలిపారు. రాబోయే రోజుల్లో అందరి సహకారంతో కార్పొరేషన్ ను మరింత బలోపేతం చేసుకుని ముదిరాజ్ యువతకు చేయూతని అందించే విధంగా కృషి చేస్తామని వెల్లడించారు.

త్వరలోనే ముదిరాజ్ కులస్తులందరూ కోరుకుంటున్న విధంగా బీసీ “డీ” నుంచి బీసీ “ఏ” లోకి మార్చే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటుతో ముదిరాజులంతా కాంగ్రెస్ పక్షాన నిలబడాలని వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో 17 స్థానాలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ముదిరాజ్ సామాజిక వర్గ పక్షాన కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రి వర్గానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో  యాదయ్య,రాములు,వెంకటేశ్,మురళి, కృష్ణ,ప్రభు,గోపాల్,అశోక్,శ్రీను,వెంకటేశ్, రాజ్ కుమార్,అంతయ్యా,కార్యకర్తలు,ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

7 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

7 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

7 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

7 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

7 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

7 hours ago