పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఏఐసీసీ నూతన ఇన్చార్జిగా నియమితులై బాధ్యతలు స్వీకరించిన మీనాక్షి నటరాజన్ ను మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటేస్టేడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ మర్యాద పూర్వకంగా కలిశారు.శుక్రవారం గాంధీ భవన్ లో జరిగిన టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో నీలం మధు పాల్గొని నూతన ఇంచార్జ్ గారిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.ఢిల్లీ నుంచి రైలు లో హైదరాబాద్ చేరుకుని గాంధీభవన్ కు వచ్చిన ఆమెకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,పీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కార్పొరేషన్ చైర్మన్లు, పీసీసీ సభ్యులతో కలిసి స్వాగతం పలికారు.ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ ఏఐసీసీ నూతన ఇన్చార్జి గా నియమితులైన మీనాక్షి నటరాజన్ నేతృత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మరింత బలపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ లో యువతకు పెద్ద పీఠ వేస్తున్నారని తెలిపారు. పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి ఒకరికి కాంగ్రెస్ లో గుర్తింపు ఉంటుందనడానికి మీనాక్షి నటరాజన్ నియామకం ఉదాహరణగా ఆయన అభివర్ణించారు.
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…
భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…
సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల సిఎస్ఆర్ నిధులు స్థానిక…