Telangana

గీతమ్ లో ఘనంగా జాతీయ గణాంక దినోత్సవం

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్లో గురువారం ‘జాతీయ గణాంకాల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వర్చువల్ విధానంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో, హెదరాబాద్ లోని భారత గణాంక సంస్థకు చెందిన డాక్టర్ జీఎస్ఆర్ మూర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్కూల్ ఆఫ్ సెన్స్ ని గణిత శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కటింగ్ స్టాక్ ‘సమస్య’ను ఆయన విశదీకరించారు. ఇది అనేక నిర్ణయాలు తీసుకోవడానికి ఉపకరిస్తుందన్నారు. విద్యార్థులను అత్యంత ఆకర్షణీయమైన, కీలకమైన పాఠ్యాంశం వైపు ఆకర్షించడానికి ఉద్దేశించిన ‘సరైన నిర్ణయాలు తీసుకోవడానికి గణితశాస్త్ర ప్రోగ్రామింగ్’ గురించి డాక్టర్ మూర్తి వివరించారు.

గీతం స్కూల్ ఆఫ్ సెన్స్డ్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ దత్తాత్రి కె.నగేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గణితశాస్త్ర విభాగాధిపతి డాక్టర్ ఎం.రాజా, సీనియర్ అధ్యాపకుడు ప్రొఫెసర్ బి.ఎం.నాయుడు పాల్గొన్నారు. గీతం గణాంక ఆచార్యులు డాక్టర్ డి.మల్లికార్జునరెడ్డి, డాక్టర్ కె. అనిల్కుమార్, శివ, అతిథిలతో కూడిన విద్యార్థి బృందం ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు. పలువురు అధ్యాపకులు, విద్యార్థులు ఈ వేడుకలో పాల్గొన్నారు.

మహలనోబిస్ గురించి:

భారతీయ శాస్త్రవేత్త, గణాంకవేత్త ప్రశాంత చంద్ర మహలనోబిస్ స్వేచ్ఛా భారతదేశం మొదటి ప్రణాళికా సంఘంలో పనిచేశారు. ఒక పెద్ద నమూనా సర్వేను రూపొందించడంలో, మహాలనోబిస్ దూరాన్ని గుర్తించడంలో ఆయన ప్రసిద్ధి చెందారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ని స్థాపించి ఆంత్రోపోమెట్రీ రంగానికి తనవంతు సహకారం అందించారు. గణాంక రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా పలు పురస్కారాలు, బహుమతులను _అందుకున్నారు.

admin

Recent Posts

భవిష్యత్తుకు తగ్గ అధ్యాపకులను తీర్చిదిద్దుతాం

గీతం స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫ్యాకల్టీ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభోత్సవంలో డాక్టర్ రిచా శర్మ మనవార్తలు ప్రతినిధి ,…

7 hours ago

*రియల్ హీరో సోనుసూద్ చేతుల మీదుగా ఘనంగా అశ్య ఫుడ్స్ ప్రోడక్ట్ లాంచ్

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్:  ఆహారం ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అది ఎప్పుడూ డిమాండ్ బిజినెస్. అందుకే ఆహారంలో…

20 hours ago

కాంగ్రెస్ కక్ష రాజకీయాలకు హైకోర్టు చెక్

“కాళేశ్వరం నిజం బయటపడింది  బీఆర్ఎస్ ఆరోపణలకు న్యాయబలం” “రైతులను మోసం చేసింది ఎవరు _ ప్రభుత్వం సమాధానం చెప్పాలి ప్రజల…

1 day ago

మహిళల భద్రత సామాజిక బాధ్యత

పరిశోధనాంశాలను వివరించిన సైకాలజీ అధ్యాపకురాలు డాక్టర్ అఫ్రిన్ వసీం మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మహిళలు భయం లేకుండా…

2 days ago

ఆర్టీసీ కార్మికుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించాలి – రవికుమార్ యాదవ్

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : ఆర్టీసీ కార్మికుల తమ న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరించాలని హెచ్‌సీయూ డిపో మరియు మియాపూర్…

2 days ago

కథనం భావోద్వేగంతో అనుసంధానం కావాలి

గీతం కార్యశాలలో కార్పొరేట్ శిక్షకురాలు జూజర్ (జె) సూచన మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రభావవంతమైన కథనం భావోద్వేగపరంగా…

2 days ago