ప్రవాహ అస్థిరతలను అధ్యయనం చేయనున్న గీతం సైన్స్ ప్రిన్సిపాల్ డాక్టర్ రెజా
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదుకు మరో ప్రతిష్ఠాత్మక పరిశోధనా ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వ సంస్థ మంజూరు చేసింది. భారత ప్రభుత్వ శాస్త్ర, సాంకేతిక విభాగం (డీఎస్టీ)లోని అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఏఎన్ఆర్ఎఫ్) గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ ప్రిన్సిపాల్ డాక్టర్ మోతాహర్ రెజాకు ప్రతిష్టాత్మక పరిశోధనా ప్రాజెక్టును మంజూరు చేసినట్టు మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు.తిరిగే వక్ర మైక్రో పైపులలో ప్రవాహ అస్థిరతల అధ్యయనం’ పేరిట చేపట్టే ఈ ప్రాజెక్టు, అధునాతన సంఖ్యా, విశ్లేషణాత్మక పద్ధతులను ఉపయోగించి మైక్రోడొమైన్ లలో ద్రవ ప్రవాహ ప్రవర్తనను మూడేళ్ల కాల పరిమితితో పరిశోధించడానికి ఉద్దేశించినదని తెలిపారు. మైక్రోఫ్లూయిడిక్స్, సంబంధిత రంగాలలో కీలకమైన అనువర్తనాలను కలిగి ఉన్న ప్రవాహ అస్థిరతలపై చేపట్టే ఈ పరిశోధన, దీనిపై లోతైన అవగాహనను అందిస్తుందని అభిలషిస్తున్నామన్నారు.ఈ పరిశోధనలో డాక్టర్ రెజాకు సహాయకారికి ఉండేందుకు జూనియర్ రీసెర్చ్ ఫెలో (జేఆర్ఎఫ్) అవసరమని తెలిపారు. ఎంటెక్ లేదా ఎమ్మెస్సీ (గణితం) ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులై, గేట్ లేదా నెట్ అర్హతతో పాటు మ్యాట్ ల్యాబ్ ప్రోగ్రామింగ్ లో ప్రావీణ్యం ఉన్న 32 ఏళ్ల వయస్సు లోపు వారు (ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులు, మహిళలకు ఐదేళ్ల సడలింపు ఉంటుంది) దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. జేఆర్ఎఫ్ గా ఎన్నికైన వారికి నెలవారీ రూ.37 వేల భత్యంతో పాటు ఇంటి అద్దె అలవెన్సు కూడా ఇస్తామని తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు డాక్టర్ రెజా 78730 49059ను సంప్రదించాలని, లేదా mreza@gitam.edu or motaharreza90@gmail.com కు ఈ-మెయిల్ దరఖాస్తు చేయాలని సూచించారు.ప్రతిష్టాత్మక ప్రాజెక్టును సాధించిన డాక్టర్ రెజాను గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు, రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, పలువురు డైరెక్టర్లు, విభాగాధిపతులు అభినందించి, నిర్ణీత కాల వ్యవధిలోగా దీనిని విజయవంతంగా పూర్తిచేయమని ప్రోత్సహించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు, శాస్త్ర సాంకేతిక రంగంలో అత్యాధునిక పరిశోధన, ఆవిష్కరణలను ముందుకు తీసుకెళ్లడంలో గీతం నిబద్ధతను తేటతెల్లం చేస్తోందన్నారు.
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…