Telangana

సూక్ష్మ , చిన్న పరిశ్రమల ద్వారానే జాతీయ ప్రగతి…- గీతం సదస్సులో వక్తలు

_ ఘనంగా ఎంఎస్ఎంఈ కాంక్లేవ్

మనవార్తలు ,పటాన్ చెరు:

మన దేశ పురోగతి ఎక్కువగా సూక్ష్మ , చిన్న , మధ్య తరహా పరిశ్రమపై ఆధారపడి ఉందని టీసీఎస్ ఐయాన్ బిజినెస్ యూనిట్ సీనియర్ వెస్ట్ ప్రెసిడెంట్ , గ్లోబల్ హెడ్ వెంగుస్వామి రామస్వామి అన్నారు . గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్ – హెదరాబాద్ ( జీఎస్బీ ) , అఖిల భారత సూక్ష్మ , చిన్న , మధ్యతరహా పరిశ్రమల సమాఖ్య ( ఎంఎస్ఎంఈ ) గురువారం సంయుక్తంగా నిర్వహించిన ‘ క్రియేటింగ్ స్టార్టప్ ఎకోసిస్టమ్’పై ఒకరోజు సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు . ఈ సందర్భంగా మాట్లాడుతూ , మనదేశంలో 65 మిలియన్ల చిన్న , మధ్యతరహా పరిశ్రమలు ఉన్నాయని , అందులో అధిక భాగం సూక్ష్మ సంస్థలదేనన్నారు . అవి మన ఆర్థిక వ్యవస్థను శక్తివంతం చేయడంతో పాటు స్థూల జాతీయోత్పత్తి ( జీడీపీ ) లో ముఖ్య భూమికను పోషిస్తున్నాయని చెప్పారు . ఎంఎస్ఎంఈలు 120 మిలియన్లకు పెగా ఉద్యోగాలను కల్పించడంతో పాటు ఎగుమతుల్లో 40 శాతం వాటా వాటిదేనని తెలిపారు .

ఎంఎస్ఎంఈలపై జాతీయ విధానం నెమ్మదిగా మారుతోందని , ఈ సానుకూల పరిణామానికి తోడు ఉక్రెయిన్తో రష్యా యుద్ధం , చైనాతో మన దేశం సంఘర్షణ వంటి ప్రపంచ భౌగోళిక రాజకీయ పరిస్థితులు ఎంఎస్ఎంఈలు నెలకొల్పడానికి మంచి అవకాశం కల్పిస్తున్నాయని వెంగుస్వామి పేర్కొన్నారు . చాలా సంస్థలు మూలధనం , ప్రొక్యూర్మెంట్ , నెపుణ్యం గల పనివారు , అమ్మకాలు , మార్కెటింగ్ , లాజిస్టిక్స్ వంటి సమస్యలతో సతమతమవుతున్నాయన్నారు . డిజిటల్ టెక్నాలజీ ద్వారా ఆయా సమస్యలకు తగిన పరిష్కారాలను విద్యార్థులు చూపగలిగితే వారు కూడా వ్యవస్థాపకులుగా ఎదగడానికి పెద్ద అవకాశంగా ఆయన అభివర్ణించారు .

విద్యార్థులు బృ ందాలుగా ఏర్పడి సమీపంలోని పరిశ్రమలకు వెళ్లాలని , వాటిని బాగా అధ్యయనం చేసి అంతర్గత విషయాలపై లోతైన అవగాహన ఏర్పరచుకోవాలని వెంగుస్వామి సూచించారు . సభాధ్యక్షత వహించిన గీతం ఉపకులపతి ప్రొఫెసర్ కె.శివరామకృష్ణ తన స్వాగతోపన్యాసంలో వ్యవస్థాపకుడి ప్రాముఖ్యతను వివరించారు . ఆలోచనలను కార్యరూపంలోకి తీసుకురావడం , సవాళ్ళను స్వీకరించే సామర్థ్యం , నిర్వ హణా మెళకువలు వ్యవస్థాపకులుగా ఎదగడానికి తోడ్పడాయన్నారు . సంప్రదాయ ఎంఎస్ఎంఈలు డిజిటలెజేషన్ వెపు మళ్లాలని వీసీ సూచించారు . గీతం హెదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ , తన వందన సమర్పణలో ఈ సదస్సు విజయవంతం కావడానికి తోడ్పడిన వారందరినీ పేరుపేరునా అభినందించారు . ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎంఈ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ అవినాష్ కె.దలాల్ , ప్లానెట్ సీఈవో , భారత వాణిజ్య మండలి ప్రాంతీయ అధిపతి నవీన్ మాడిశెట్టి , ఏఐఎంఏ సీనియర్ వెస్ట్ ప్రెసిడెంట్ సుందిప్ అతిత్ , డాక్టర్ హోమీ భాభా విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్రట్ స్వాతి నావల్ తదితరులు పాల్గొన్నారు .

admin

Recent Posts

వందేమాతరం సామూహిక గీతాలాపన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…

2 days ago

ఇష్టా విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఘనంగా ఐఐటి రామయ్య జన్మదిన వేడుకలు

చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…

2 days ago

గీతంలో ఉల్లాసంగా కేక్ మిక్సింగ్ వేడుక

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…

2 days ago

తాగునీటి పంపిణీలో ఇబ్బందులు తలెత్తితే ఉద్యమాలకు సిద్ధం

రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…

1 week ago

కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్న బిస్లరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…

1 week ago

శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో సెమినార్

నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…

1 week ago