politics

అవ‌య‌వ‌దానం చేసి…మ‌రోసారి జీవించ‌డం – రుద్రారం గ్రామ ఉప సర్పంచ్ యాదయ్య

_రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డి బ్రెయిన్ డెడ్ అయిన ప్ర‌వీణ్

_ప్ర‌వీణ్ కు చెందిన రెండు కిడ్నీలు, లివ‌ర్ ను దానం చేసిన కుటుంబ స‌భ్యులు

_చ‌నిపోయిన త‌ర్వాత జీవించే అవ‌కాశం ఒక్క అవ‌య‌వ‌దానం ద్వారానే క‌లుగుతుంది – సుధీర్ రెడ్డి

మనవార్తలు ,రుద్రారం:

మనిషి చనిపోయిన తర్వాత జీవించే అవకాశం ఒక్క అవయవదానం ద్వారానే కలుగుతుందని రుద్రారం గ్రామ ఉప సర్పంచ్ యాదయ్య అన్నారు. దేశంలో ఏటా ఐదు లక్షల మంది అవయవదానం కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. మనిషి బతికి వున్నప్పుడే కాదు ,చనిపోయినప్పుడు తర్వాత అవయవాలు దానం చేసి మరికొందరు జీవితాల్లో వెలుగు నింపవ‌చ్చ‌ని ఆయ‌న‌ తెలిపారు. అవ‌య‌వ‌దానానికి కుటుంబ సభ్యుల సహకారం ఎంతో అవసరమ‌న్నారు.

సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు మండలం రుద్రారం గ్రామానికి చెందిన పెద్ద‌బోతుల ప్ర‌వీణ్ ఇటీవల రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డి అప‌స్మార‌క స్థితిలోకి వెళ్ళాడు. వెంట‌నే హైద‌రాబాద్ నాన‌క్ రాం గూడ‌లోని కాంటినెంట‌ల్ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. రెండు రోజుల పాటు చికిత్స అందించిన వైద్యుల బృందం బ్రెయిన్ డెడ్ గా గుర్తించారు. ఈ విష‌యం తెలుసుకున్న జీవ‌న్ ధాన్ బృందం ప్ర‌వీణ్ కుటుంబ స‌భ్యుల‌ను క‌లిసి అవ‌య‌వ‌దానం చేసేందుకు ఒప్పించారు. దీంతో వెంట‌నే ప్ర‌వీణ్ కుటుంబ స‌భ్యులు అవ‌య‌వదానం చేసేందుకు అంగీక‌రించారు.

 

దీంతో బ్రెయిన్ డెడ్ అయిన ప్ర‌వీణ్ రెండు కిడ్నీలు, లివ‌ర్ సేక‌రించి మరో ముగ్గురికి ప్రాణ‌దానం చేశారు. మ‌న దేశంలో అవ‌య‌వ‌దానంపై అనేక అపోహ‌లు ఉన్నాయ‌ని..మూడ‌న‌మ్మ‌కాల‌తో అవ‌య‌వ‌దానం చేసేందుకు ముందుకు రావ‌డంలేద‌ని ప్ర‌వీణ్ తండ్రి తెలిపారు . దానాల్లో అన్న‌దానం గొప్ప‌ద‌ని పూర్వం అనేవార‌ని..కానీ ఇప్పుడు అన్ని దానాల కంటే ప్రాణ‌దానం గొప్ప‌ది .ప్రాణ‌దానానికి దోహ‌ద‌ప‌డే అవయవదానం మ‌రింత గొప్ప‌ది. అవయవదాన ప్రాధాన్యంపై కొన్ని అపోహలూ ఉన్నాయ‌ని.. వాటిని తొల‌గించుకోవాల్సిన అస‌వ‌రం ఎంతైనా ఉంది.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సుధీర్ రెడ్డి, ఉప సర్పంచ్ యాదయ్య, ఎంపీటీసీ హరి ప్రసాద్ రెడ్డి ,వార్డు సభ్యులు నారాయణ రెడ్డి, శ్రీనివాస్ ,రాజిరెడ్డి, మరియు అమరేందర్ రెడ్డి, విష్ణువర్ధన్, రెడ్డి ,కంచరి శ్రీనివాస్, ఎల్లయ్య, మాజీ సర్పంచ్ లక్ష్మయ్య భాస్కర్ గ్రామ యువకులు నాయకులు తదితరులు పాల్గొన్నారు

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago