మనవార్తలు ,పటాన్ చెరు:
దేశానికి ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.చిట్కుల్ గ్రామంలో తెరాస ఆవిర్భావ దినోత్సవ సంబరాలు తెరాస జెండాను ఆవిష్కరించి, కేకు కట్ చేసి కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. కొత్త రాష్ట్రం వచ్చాక రెండుసార్లు కేసిఆర్ నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన తెరాసకు మూడోసారి కూడా అధికారంలోకి వచ్చేలా కృషి చేస్తామని చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ అన్నారు. గతంలో తెరాస జెండా పట్టుకోని వారిని సైతం వారిచేత జెండా రెపరెపలాడించేలా చేశారని అన్నారు.కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతు బంధు, రైతు బీమా, ఆసరా, వృద్ధాప్య, అసారా పింఛన్లే కాక కేసీఅర్ కిట్టు ఇలాంటి అనేక సంక్షేమ పథకాలతో అభివృద్ధి పథంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దూసుకు పోతున్నారని తెలిపారు. దేశానికి చుక్కానిలా ముఖ్యమంత్రి కేసీఆర్ పథకాలు నిలుస్తున్నాయి ఆయన తెలిపారు.
తెలంగాణ వస్తే చీకట్లు కమ్ముకుంటాయని చెప్పిన నల్లారి కిరణ్ కుమార్ మాటలను తారుమారు చేస్తూ 24 గంటల కరెంటు అందిస్తూ తెలంగాణలో వెలుగులు పంచుతుంటే పక్క రాష్ట్రంలో లో చీకటి బతుకులు అయ్యాయని ఎద్దేవాచేశారు ప్రధాని సైతం ముఖ్యమంత్రి కేసీఆర్ ను చూసి కిసాన్ పథకంలో నగదు జమ చేస్తున్నారని అన్నారు. దళిత బంధు త్వరలో అర్హులందరికీ వచ్చేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారని అంబేద్కర్ ఆశయాల మేరకు సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారని తెలిపారు. కుల మత వర్గాలకు అతీతంగా తెలంగాణలో పథకాలు ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు.
మంత్రి కేటీఆర్ హైదరాబాద్ ను సుందరాంగి తీర్చిదిద్దారన్నారు. సుల్తాన్ పూర్ వంటి పారిశ్రామిక వాడలు నెలకొల్పి చాలామందికి ఉపాధి కల్పించారన్నారు. ఈ కార్యక్రమంలో టీఆరెఎస్ విలేజ్ ప్రసిడెంట్ ప్రశాంత్, పిఎసిఎస్ చైర్మన్ నారాయణ రెడ్డి, వార్డు సభ్యులు దుర్గయ్య, క్రిష్ణ, వెంకటేష్, బుజంగం, మురళి, వెంకటేష్,రాజ్ కుమార్, ఆంజనేయులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు,ఎన్ఎమ్ఎమ్ యువసేన పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: బీజేపీ మోడి ప్రభుత్వంలో 153 సార్లు పరీక్షా పత్రాల లీకుల వల్ల 7 కోట్ల మంది విద్యార్ధుల…
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా…
బిస్లరీ యాజమాన్యం చట్టవిరుద్ధంగా తొలగించిన కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి బిస్లరీ యాజమాన్యం మొండివైఖరి వీడాలి..లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తం పోరాటం…
రాహుల్ గాంధీని చూసి కేంద్ర ప్రభుత్వం భయపడుతోంది లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో బీజేపీ చెలగాటం నీట్ పేపర్ లీక్‌కు…
మనవార్తలు ప్రతినిధి, సంగారెడ్డి: జిన్నారం సర్వే నెం. 1 బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి…
జాతీయ రహదారి విస్తరణ పనుల్లో నాణ్యతకు తిలోదకాలు..! అధికారుల నిర్లక్ష్యంతో కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం..! ప్రజల సొమ్ముతో చేసే పనుల్లో అవినీతి,…