Telangana

గీతంలో జాతీయ ఫార్మసీ విద్యా దినోత్సవ వేడుకలు

ముఖ్య అతిథిగా ఐఐసీటీ శాస్త్రవేత్త డాక్టర్ సిస్ట్లా రామకృష్ణ, ఆత్మీయ అతిథిగా డాక్టర్ వంశీ మాడుగుల

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

ప్రొఫెసర్ ఎం.ఎల్. ష్రాఫ్ 124వ జయంతిని పురస్కరించుకుని, హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీలో బుధవారం జాతీయ ఫార్మసీ విద్యా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ‘ఔషధశాస్త్రంలో కృత్రిమ మేధస్సు: ఔషధ విద్య, పరిశోధనలలో ఒక నూతన ఒరవడి’ ఇతివృత్తంగా దీనిని నిర్వహించారు.ఐఐసీటీ-హైదరాబాదు ముఖ్య శాస్త్రవేత్త డాక్టర్ సిస్ట్లా రామకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై, వర్ధమాన ఫార్మసిస్టులు తమ వృత్తి గౌరవాన్ని నిలబెట్టుకోవాలని, సంప్రదాయ పరిధులకు అతీతంగా ఆలోచించాలని, అంతర్-విభాగ అభ్యసనాన్ని స్వీకరించాలని పిలుపునిచ్చారు. ఫార్మసీలోని విభిన్న రంగాలను అన్వేషించాలని, వినూత్నమైన, సమస్య-పరిష్కార దృక్పథాన్ని అలవర్చుకోవాలని విద్యార్థులు, పరిశోధకులను ఆయన ప్రోత్సహించారు.

సాయి లైఫ్ సైన్సెస్ లోని డి.ఎం.పి.కె. విభాగాధిపతి డాక్టర్ వంశీ మాడుగుల గౌరవ అతిథిగా హాజరై, ఫార్మాస్యూటికల్ పరిశోధనలో ఏఐ యొక్క పరివర్తనాత్మక పాత్రను వివరిస్తూ కీలకోపన్యాసం చేశారు. డ్రగ్ మెటబాలిజం, ఫార్మకోకైనటిక్స్ (డి.ఎం.పి.కె.) యొక్క పెరుగుతున్న ప్రాముఖ్యత, సాంప్రదాయ ఔషధ అభివృద్ధిలో సవాళ్లు, ఏఐ-ఆధారిత విధానాలు సామర్థ్యాన్ని ఎలా పెంచగలవు, ముందస్తు ప్రమాద అంచనా ఎలా సాధ్యం, అంచనాత్మక, నివారణ వ్యూహాల వైపు దృష్టిని ఎలా మళ్లించగలవు అనే విషయాలను విశదీకరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా, పరిశ్రమ నిపుణులతో ఒక ప్యానెల్ చర్చను కూడా ఏర్పాటు చేశారు. ఇందులో పాల్గొన్న పరిశ్రమ నిపుణులు ఫార్మాస్యూటికల్ సైన్సెస్ లో ప్రస్తుత పోకడలు, భవిష్యత్తు అవకాశాలపై తమ అభిప్రాయాలను వెల్లడించారు.

తొలుత, ఈ కార్యక్రమ నిర్వాహకుడు, ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి.శివకుమార్ అతిథులను స్వాగతించి, ఏఐ-ఆధారిత ఫార్మసీ విద్యలో ఉద్భవిస్తున్న అవకాశాలను చురుకుగా వినియోగించుకోవాలని విద్యార్థులను ప్రోత్సహించారు. ఈ కార్యక్రమాన్ని అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ గటాడి శ్రీకాంత్, డాక్టర్ ప్రియాసింగ్ సమన్వయం చేశారు. బి.ఫార్మా, ఎం.ఫార్మా, పీహెచ్.డీ. విద్యార్థులు ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొని, పలు సందేహాలను అడిగి నివృత్తి చేసుకున్నారు.

admin

Recent Posts

సర్వమతాల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యం.. ఎమ్మెల్యే జిఎంఆర్

36 లక్షల రూపాయలతో గుమ్మటాలకు ప్రహారీ గోడ నిర్మాణ పనులకు శంకుస్థాపన.. మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు :…

17 hours ago

అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు బాబు జగ్జీవన్ రామ్: మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇంచార్జ్ నీలం మధు ముదిరాజ్

మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు : భారతదేశ సామాజిక, రాజకీయ చరిత్రలో అణగారిన వర్గాల గొంతుకను వినిపించిన మహోన్నత…

17 hours ago

డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జీవితం స్ఫూర్తిదాయకం

పటాన్ చెరులో ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు : భారత మాజీ…

17 hours ago

​బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బాబు జగజీవన్ రామ్_యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టుశ్రీధర్

మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు : భారత మాజీ ఉప ప్రధాని, స్వాతంత్ర్య సమరయోధుడు బాబు జగజీవన్ రామ్…

17 hours ago

నూతన మున్సిపాలిటీలలో అభివృద్ధిని పరుగులు పెట్టించండి

అతి త్వరలో 75 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన.. ప్రతి మున్సిపాలిటీలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వండి..…

1 day ago

ఏసుక్రీస్తు బోధనలు ఆచరణీయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్ చెరులో ఘనంగా రన్ ఫర్ జీసస్ కార్యక్రమం మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు : ఏసుక్రీస్తు బోధనలు…

2 days ago