విజయవంతంగా పూర్తిచేసిన విద్యార్థులకు గుర్తింపు కార్డు, ప్రశంసా పత్రాల ప్రదానం
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:
హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో వారం రోజుల పాటు నిర్వహించిన పౌర రక్షణ వాలంటీర్ల శిక్షణా కార్యక్రమం బుధవారం విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమాన్ని వివిధ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ శాఖల సహకారంతో, తెలంగాణ అగ్నిమాపక విపత్తు స్పందన అత్యవసర & పౌర రక్షణ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు.వైమానిక దాడులు, రసాయన సంఘటనలు, అణు ధార్మికత పరిస్థితులు, ప్రకృతి వైపరీత్యాల వంటి అత్యవసర పరిస్థితులలో సమర్థవంతంగా స్పందించడానికి అవసరమైన నైపుణ్యాలను ఈ ఆచరణాత్మక శిక్షణ ద్వారా ఇందులో పాల్గొన్న విద్యార్థులకు అందించారు. సహాయక చర్యలు, అగ్నిమాపక పద్ధతులు, ప్రథమ చికిత్స, జన సమూహ నిర్వహణ, సహాయక సామగ్రి పంపిణీలో అనుసరించాల్సిన వ్యూహాలపై వాలంటీర్లు ఆచరణాత్మక శిక్షణ పొందారు.
సంక్షోభ పరిస్థితులలో సువ్యవస్థితమైన, సకాలంలో స్పందించేలా తీర్చిదిద్దడంతో పాటు పోలీసు శాఖ, అగ్నిమాపక సేవలు, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్) వంటి కీలక అత్యవసర ప్రతిస్పందన సంస్థలతో సమన్వయం చేసుకునేందుకు కూడా విద్యార్థి స్వచ్ఛంద సేవలకు మార్గదర్శనం చేశారు.తక్షణ సహాయం అందించగల శిక్షణ పొందిన కమ్యూనిటీ వాలంటీర్ల బలమైన నెట్ వర్కును నిర్మించడంలో ఈ కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తుందని, తద్వారా అత్యవసర పరిస్థితులలో ప్రాణాలను కాపాడటానికి, నష్టాన్ని తగ్గించడానికి సహాయపడుతుందని శిక్షణను పర్యవేక్షించిన ఉన్నతాధికారులు పేర్కొన్నారు.
ఈ శిక్షణను విజయవంతంగా పూర్తిచేసిన గీతం విద్యార్థి స్వచ్ఛంద సేవకులకు, జాతీయంగా, అంతర్జాతీయంగా కూడా విలువైన గుర్తింపు కార్డు, ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ విశిష్టమైన, ప్రభావవంతమైన శిక్షణా కార్యక్రమంలో భాగమైనందుకు గీతం విద్యార్థులు ఒకింత గర్వాన్ని, సంతృప్తిని వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమాన్ని మార్చి 12న గీతం హైదరాబాదు రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, సంగారెడ్డి జిల్లా అగ్నిమాపక శాఖాధికారి బి.నాగేశ్వరరావు, పటాన్ చెరు అగ్నిమాపక శాఖాధికారి కె.వి. నాగేంద్ర, ఇతర అధికారుల, సిబ్బంది సమక్షంలో లాంఛనంగా ప్రారంభించిన విషయం విదితమే.
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…