Telangana

పర్యాటక కేంద్రంగా ముత్తంగి ఎంక చెరువు

ఏడు కోట్ల 60 లక్షల రూపాయలతో చెరువు సుందరీకరణ

పనులను పరిశీలించిన ఎమ్మెల్యే జిఎంఆర్

అతి త్వరలో ప్రారంభోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు :

ముత్తంగి డివిజన్ పరిధిలోని ఎంక చెరువును 7 కోట్ల 60 లక్షల రూపాయలతో సుందరీకరణ చేస్తున్నామని.. అతి త్వరలో ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రానున్నట్లు పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. సోమవారం ఉదయం హెచ్ఎండిఏ అధికారులు, స్థానిక మాజీ ప్రజా ప్రతినిధులతో కలిసి చెరువు సుందరీకరణ పనులను పరిశీలించారు. స్వయంగా చెరువు కట్టపై ద్విచక్ర వాహనంపై తిరుగుతూ పనుల పురోగతిని తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సుమారు 60 ఎకరాల విస్తీర్ణంలో గల ఎంక చెరువును పర్యటకంగా అభివృద్ధి చేయాలని లక్ష్యంతో హెచ్ఎండిఎ ద్వారా 7 కోట్ల 60 లక్షల రూపాయలు నిధులు కేటాయించడం జరిగిందని తెలిపారు. ఇందులో భాగంగా కట్ట అభివృద్ధితోపాటు బతుకమ్మ ఘాట్, లైటింగ్, వాకింగ్ ట్రాక్, హైమాస్ట్ లైటింగ్, గార్డెనింగ్, తదితర పనులు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. చెరువులో గుర్రపు డెక్క తొలగింపు, పూడికతీత పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

80 శాతం పనులు పూర్తయ్యాయని.. మరో రెండు నెలల్ల పనులు పూర్తిచేసి.. ప్రజలకు అందుబాటులోకి తీసుకొని వస్తామని హామీ ఇచ్చారు. ఇస్నాపూర్ ప్రజలు సైతం చెరువు కట్ట పైకి సులభంగా చేరుకునేందుకు కనెక్టింగ్ బ్రిడ్జి నిర్మించనున్నట్లు తెలిపారు. ముత్తంగితోపాటు ఇస్నాపూర్, పాశమైలారం, చిట్కుల్, లకడారం గ్రామాల ప్రజలకు ఆహ్లాదకరమైన చెరువు అందుబాటులోకి వస్తుందని తెలిపారు. పటాన్‌చెరులోని సాకి చెరువు, తిమ్మక్క చెరువు, దోషం చెరువులను సైతం పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎండిఏ డిఈ రామారావు, మాజీ సర్పంచ్ ఉపేందర్, సీనియర్ నాయకులు శ్రీనివాస్, కుమార్ గౌడ్, ప్రభాకర్, కిట్టు, శ్రీనివాస్ రెడ్డి, మేరాజ్ ఖాన్, రామకృష్ణ, అబేద్, రవి, తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

4 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

4 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

5 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago