Telangana

కార్మిక కుటుంబానికి అండగా నిలిచిన ఎమ్మెల్యే జిఎంఆర్

గుండెపోటుతో మరణించిన కార్మికుడి కుటుంబానికి 5 లక్షల 50 వేల రూపాయల నష్టపరిహారం అందజేత..

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు :

కార్మిక రంగానికి పెద్దపీటవేస్తూ వారి సంక్షేమానికి అనునిత్యం కృషి చేస్తున్న పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి మరో సారి కార్మిక రంగం పట్ల తన నిబద్ధతను చాటుకున్నారు. గుండెపోటుతో మరణించిన కాంట్రాక్ట్ కార్మికుడి కుటుంబానికి పరిశ్రమ యాజమాన్యంతో చర్చించి మెరుగైన నష్టపరిహారం అందించి వారి కుటుంబానికి అండగా నిలిచారు. వివరాల్లోకి వెళ్తే ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని పాశమైలారం పారిశ్రామికవాడలో గల స్మార్కో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో కాంటాక్ట్ కార్మికుడిగా పనిచేస్తున్న కృష్ణారెడ్డి (35) మూడు రోజుల క్రితం పరిశ్రమలో విధులు నిర్వహిస్తున్న సమయంలో గుండెపోటుతో మృతి చెందాడు. అత్యంత నిరుపేద కుటుంబం నేపథ్యం కలిగిన కృష్ణారెడ్డి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ స్థానిక బిఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే జిఎంఆర్ దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే జిఎంఆర్ పరిశ్రమ యాజమాన్యంతో చర్చించారు. మృతి చెందిన కార్మికుడి కుటుంబానికి న్యాయం చేయాలని సూచించారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన పరిశ్రమ యాజమాన్యం 5 లక్షల రూపాయలు నష్టపరిహారంతో పాటు 50 వేల రూపాయలు అంత్యక్రియల ఖర్చులు భరిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు శనివారం సాయంత్రం పటాన్‌చెరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో.. ఎమ్మెల్యే జిఎంఆర్ సమక్షంలో మృతి చెందిన కార్మికుడి కుటుంబానికి నష్టపరిహారం డబ్బులను అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మిక నేపద్యం నుండి రాజకీయాల్లోకి వచ్చిన తనకు కార్మికుల కష్టనష్టాలు తెలుసునని అన్నారు. నియోజకవర్గ పరిధిలోని కార్మిక రంగానికి ఎల్లప్పుడూ అండగా ఉంటూ వారి ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. పరిశ్రమల యాజమాన్యాలు కార్మికుల భద్రతకు పెద్దపీట వేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, ఐలా పటాన్‌చెరు అధ్యక్షులు సుధీర్ రెడ్డి, పాశమైలారం వైస్ చైర్మన్ రాఘవరెడ్డి, ప్రతినిధులు ఆనంద్ రెడ్డి, శ్రీనివాస్, రమేష్, రమణారెడ్డి. లక్ష్మణరావు, సురేష్. రంజిత్, సీనియర్ నాయకులు శ్రీధర్ చారి, చంద్రశేఖర్, మధు, పరిశ్రమ ప్రతినిధులు పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

10 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

10 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

10 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

10 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

10 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

10 hours ago