మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు :
ప్రపంచ తెలుగు సాహితీ మహాసభలను విజయవంతం చేయాలని మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ పట్టభద్రుల శాసనమండలి సభ్యులు అంజి రెడ్డి పిలుపునిచ్చారు. జూన్ 6,7 తేదీలలో రాజమహేంద్రవరంలో జరుగనున్న ప్రపంచ తెలుగు సాహిత్య మహాసభలకు సంబంధించిన గోడ పత్రికను ఎమ్మెల్సీ అంజిరెడ్డి చేతుల మీదుగా అవిష్కరించటం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. తెలుగు భాషా పరిరక్షణకు బాధ్యతయుతంగా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తెలుగు భాషోద్దరణకు సాహితీ సభలు ఎంతో కీలకమన్నారు. ఈ సందర్భంగా శ్రీ శ్రీ కళా వేదిక జాతీయ అధ్యక్షురాలు ఈశ్వరీ భూషణం,ప్రపంచ తెలుగు సాహితీ మహాసభల జాతీయ సమన్వయకర్తలు , స్థానిక కవులు తెలుగు వెలుగు సాహిత్య జాతీయ వేదిక జాతీయ ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి రచయితల సంఘం అధ్యక్షులు మోటూరి నారాయణరావు శేరిలింగంపల్లి రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి రవీంద్రబాబు అరవా, శేరిలింగంపల్లి రచయితల సంఘం ఉపాధ్యక్షులు జె.వి.కుమార్ చేపూరి, ప్రముఖ కవి, రచయిత, దర్శకులు గూండ్ల నారాయణ తదితరులు ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారిని గౌరవ ప్రధంగా కలిసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు,కవులు తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…