Telangana

రవి యాదవ్ కు ముదిరాజ్ ల మద్దతు

మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి :

శేరిలింగంపల్లి లోని పాపి రెడ్డి కాలనీ కి చెందిన ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు సాయి నందన్ ముదిరాజ్ ఆద్వర్యంలో సంఘ సభ్యులు శనివారం రోజున గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ యూత్ వైస్ ప్రెసిడెంట్ మారబోయిన రవి యాదవ్ ను మసీద్ బండ లోని ఆయన కార్యాలయం లో కలసి సంఘంలో ఉన్న సమస్యల గురించి, పాపి రెడ్డి కాలనీ సమస్యల గురించి చర్చించారు. మురికి కాలువలు, వీధిలైట్లు, డ్రైనేజీ వంటి సమస్యలను ఎవరు పట్టించు కోవడం లేదని, ఎన్నిసార్లు మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ప్రభుత్వం అధికారుల పని తీరు ఉందని ఆరోపించారు. అధికారులు స్పందించి సత్వరం చర్య తీసుకోవాలని కోరారు. ముదిరాజ్ సంఘం సభ్యులు మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ కి రవి యాదవ్ కు సంఘo తరపున ఎప్పటికీ మద్దతునిస్తూ ముందుకు సాగుతామన్నారు. రవి యాదవ్ నాయకత్వాన్ని బలోపేతం చేస్తామని సంఘo అధ్యక్షుడు సాయి నందన్ ముదిరాజ్ తెలిపారు. ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఎటువంటి సమస్యలు ఉన్నా మీకు ఎల్లపుడు తోడు నీడగా మీకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని మారబోయిన రవి యాదవ్ అన్నారు . ఈ కార్యక్రమంలో కృష్ణ ముదిరాజ్, మందల కృష్ణ ముదిరాజ్, గణేష్, అశోక్, శివాజీ, ఉమేష్, దిలీప్, టిల్లు, గోవర్ధన్,వెంకటేష్, చెన్ని, బాలు, రాజు, వినోద్, కార్తీక్, బాలరాజ్ ముదిరాజ్, బబ్లు, నర్సింహా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

9 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

9 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

9 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

10 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

10 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

10 hours ago