Hyderabad

తానా అంతర్జాతీయ కవి సమ్మేళనానికి ఎంపికైన కవి,రచయిత మోటూరి నారాయణరావు

మనవార్తలు ,హైదరాబాద్:

ఉత్తర  అమెరికా తెలుగు సంఘం, తానా ప్రపంచ సాహిత్య వేదిక “ఆజాదీకా అమృత మహోత్సవ్” ఉత్సవాలు పురస్కరించుకుని పలు సామాజిక అంశాలపై  ప్రతిష్ఠాత్మకంగా అంతర్జాతీయ కవితల పోటీలు నిర్వహించింది. ఈ పోటీలో ఆంధ్రప్రదేశ్ పాలకొల్లు లో పుట్టి హైదరాబాద్ శేరిలింగంపల్లి లో నివాసం ఉంటున్న కవి మోటూరి నారాయణరావు ఎంపికయ్యారు. ఏప్రిల్ 22, 23, 24 తేదీలలో జూమ్ లో తానా నిర్వహించబోతున్న ప్రపంచస్థాయి కవితా వేదిక మీద  మోటూరి నారాయణరావు తమ కవితను వినిపించబోతున్నారు.

భారత దేశ చరిత్ర లో భాగంగా స్వాతంత్రోద్యమ చరిత్రను, పోరాటాలను వర్ణిస్తూ, భావయుక్తంగా వారు రాసిన “చరిత్ర పుటల్లో-చీకటి అక్షరాలు” అనే కవిత ఈ పోటీలో ఎంపికయింది.ఇంతటి విశేషమైన కార్యక్రమంలో ఎంపిక చేసి, అంతర్జాతీయంగా పరిచయం చేస్తున్నందుకు తానా అధ్యక్షులు శ్రీ అంజయ్య చౌదరి లావు గారికి, తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త శ్రీ చిగురుమళ్ళ శ్రీనివాస్ గారికి, ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డాక్టర్ ప్రసాద్ తోటకూర గారికి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.

అనేకమంది దేశ, విదేశ తెలుగు కవులు, ప్రముఖులు హాజరయ్యే ఈ “తానా కవితాలహరి” కార్యక్రమం తానా అధికారిక యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. “యప్ టీవీ” ద్వారా అమెరికాతో పాటు, యూరప్ దేశాలలో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది.  ఈ టీవీ భారత్, మన టీవీ, టీవీ ఆసియా తెలుగు మరియు ఇతర మాద్యమాలలో ప్రసారం కానుంది.  సరళమైన భాషలో, సామాజిక స్పృహ కోసం రచనలు చేసే మోటూరి నారాయణరావు  గారు అంతకుముందు గుండె సవ్వళ్లు అనే కవితా సంపుటి పుస్తకాన్ని ప్రచురించారు.

హైదరాబాద్ లో పాత్రికేయ వృత్తిలో వుంటూ ఎస్ వీ ఫౌండేషన్ చైర్మన్ గా సామాజిక సేవా కార్యక్రమాలు, తెలుగు వెలుగు సాహిత్య వేదిక ప్రధాన కార్యదర్శి గా సాహిత్య సేవలు చేస్తూ, వీరు జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి కవితా అవార్డులు, పురస్కారాలు మరియు కవిరత్న, కళారత్న, సేవా జ్యోతి, మదర్ థెరిస్సా స్మారక పురస్కారం, డాక్టర్ బీఆర్ అంబేద్కర్స్మారక అవార్డు లాంటి బిరుదులెన్నో పొందారు.ప్రముఖులతో ప్రసంశలు అందుకున్నారు. ఈరోజు హైదరాబాద్ శేరిలింగంపల్లి ఖ్యాతిని  ప్రపంచ స్థాయికి తీసుకువెళ్ళిన మోటూరి నారాయణరావు గారిని నగర పెద్దలు, ప్రముఖులు, సాహితీవేత్తలు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

7 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

7 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

7 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

3 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

3 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

3 days ago