Telangana

పెట్టుబడుదారుల కోసమే పనిచేస్తున్న మోడీ ప్రభుత్వం

– మత రాజకీయాలకు కేరాఫ్ మోడీ ప్రభుత్వం

– బిజెపిని ఓడిస్తేనే కార్మికులకు భవిష్యత్తు

రాజ్యాంగ విలువలు మరచి పాలన సాగిస్తున్న బీజేపీని ఇంటికి సాగనంపాలి

-సిఐటియు సెమినార్ లో

-సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

పెట్టుబడిదారుల కోసమే మోడీ ప్రభుత్వం పని చేస్తుందని,రాజ్యాంగ విలువలు మరచి పాలన సాగిస్తున్న బీజేపీని ఇంటికి సాగనంపాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మంగళవారం పటాన్ చెరు పట్టణంలోని మైనార్టీ ఫంక్షన్ హాల్లో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు పాండురంగారెడ్డి అధ్యక్షతన,సీఐటీయూ ఆధ్వర్యంలో పార్లమెంట్ ఎన్నికలు, కార్మిక వర్గ పాత్ర అనే అంశం పై జరిగిన సెమినార్ లో సిఐ టియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పాల్గొని మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం పెట్టుబడిదారుల కోసమే పని చేస్తున్నట్లు ఆరోపించారు. కార్మిక చట్టాలను సవరించిన బీజేపీని ఓడిస్తేనే కార్మికులకు భవిష్యత్తు అన్నారు. పదేళ్లపాటు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రజలకు వరగపెట్టిందేమి లేదని, పైగా పరిస్థితులను మరింత దిగజార్చిందని రాములు ధ్వజమెత్తారు. ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేక తను దారిమళ్లించడానికి అయోధ్యలో రామమందిరం పేరుతో మత రాజకీ యాలు చేస్తోందన్నారు. వ్యవసాయ నల్ల చట్టాలను తెచ్చి వ్యవసాయ రంగాన్ని సైతం కార్పోరేట్‌లకు కట్టబెట్టేలా కుట్రలు చేసిందని ఘాటుగా విమర్శించారు. రైతులపై కాల్పు లు జరిపించిన హీన చరిత్రను ప్రధాని మోడీ మూటగట్టుకున్నారని దుయ్యబ ట్టారు. ఇప్పటికే రాజ్యాంగ విలువలను మంటగలుపుతున్న బిజెపి ఈ సారి ఎన్నికల్లో గెలిస్తే రాజ్యాంగాన్నే మార్చాలని చూస్తోందని, వారి ఆగడాలను నిలువరించాలంటే ఎన్‌డిఎ కూటమిని ఓడించి, ఇండియా కూటమి ని గెలిపించాలని కోరారు. నల్ల చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన పోరాట సందర్భంలో రైతులకు మోడీ హామీలిచ్చినా వాటిని అమలు చేయలేదని, ఉపాధి హామీకి నిధులు తగించి ఆ చట్టాన్నే నిర్వీర్యం చేస్తున్నారని, కూలీలకు 100 రోజుల పని కలగా మారిందని విమర్శించారు. కార్మిక చట్టాలను 4 లేబర్‌ కోడ్‌లు గా మార్పు చేసి కార్మికుల హక్కులను హరించారని, జీఎస్టీలో రాష్ట్రాల పన్నుల వాటాను తగ్గించారని, ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు కట్టబెడుతున్నారని, దేశ ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేస్తూ రాజ్యాంగ వ్యవస్థలను ధ్వంసం చేస్తు న్నారని విమర్శించారు. ఇన్ని దారుణాలకు పాల్పడుతున్న బీజేపీని ఇంటికి సగనంపాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామని, ఇల్లు ఇళ్ల స్థలాల కోసం పేదలు గుడిసెలు వేసుకుని ఉంటే కూల్చేస్తున్నారన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.

 

-కార్మికులను పట్టించుకోని బిజెపిని ఓడించాలి

-సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లికార్జున్

కార్మికులను పట్టించుకోని బిజెపిని ఓడించాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లికార్జున్ పిలుపునిచ్చారు. కార్మికులను ఏమాత్రం పట్టించుకోలేదని అనేక పరిశ్రమలు మూతపడి వేలాది ఉద్యోగాలు పోయి రోడ్డున పడ్డారని అన్నారు. దేశ సంపాదన మొత్తం పెట్టుబడుదారులకు తాకట్టు పెట్టారని మండిపడ్డారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు బి మల్లేష్, కోశాధికారి కే రాజయ్య, నాయకులు వాజీద్ అలీ మాట్లాడారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు బి నాగేశ్వరరావు,వి ఎస్ రాజు,అనంత రావు,పద్మారావు, సంతోష్,తిరుపతి, లఖాన్,గంగాధర్,వెంకట్ రామ్ రెడ్డి ,విష్ణు,రమణారెడ్డి,మూర్తి,బివి ఆర్ కె రాజు తది తరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

9 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

9 hours ago