– మత రాజకీయాలకు కేరాఫ్ మోడీ ప్రభుత్వం
– బిజెపిని ఓడిస్తేనే కార్మికులకు భవిష్యత్తు
రాజ్యాంగ విలువలు మరచి పాలన సాగిస్తున్న బీజేపీని ఇంటికి సాగనంపాలి
-సిఐటియు సెమినార్ లో
-సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
పెట్టుబడిదారుల కోసమే మోడీ ప్రభుత్వం పని చేస్తుందని,రాజ్యాంగ విలువలు మరచి పాలన సాగిస్తున్న బీజేపీని ఇంటికి సాగనంపాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మంగళవారం పటాన్ చెరు పట్టణంలోని మైనార్టీ ఫంక్షన్ హాల్లో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు పాండురంగారెడ్డి అధ్యక్షతన,సీఐటీయూ ఆధ్వర్యంలో పార్లమెంట్ ఎన్నికలు, కార్మిక వర్గ పాత్ర అనే అంశం పై జరిగిన సెమినార్ లో సిఐ టియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పాల్గొని మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం పెట్టుబడిదారుల కోసమే పని చేస్తున్నట్లు ఆరోపించారు. కార్మిక చట్టాలను సవరించిన బీజేపీని ఓడిస్తేనే కార్మికులకు భవిష్యత్తు అన్నారు. పదేళ్లపాటు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రజలకు వరగపెట్టిందేమి లేదని, పైగా పరిస్థితులను మరింత దిగజార్చిందని రాములు ధ్వజమెత్తారు. ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేక తను దారిమళ్లించడానికి అయోధ్యలో రామమందిరం పేరుతో మత రాజకీ యాలు చేస్తోందన్నారు. వ్యవసాయ నల్ల చట్టాలను తెచ్చి వ్యవసాయ రంగాన్ని సైతం కార్పోరేట్‌లకు కట్టబెట్టేలా కుట్రలు చేసిందని ఘాటుగా విమర్శించారు. రైతులపై కాల్పు లు జరిపించిన హీన చరిత్రను ప్రధాని మోడీ మూటగట్టుకున్నారని దుయ్యబ ట్టారు. ఇప్పటికే రాజ్యాంగ విలువలను మంటగలుపుతున్న బిజెపి ఈ సారి ఎన్నికల్లో గెలిస్తే రాజ్యాంగాన్నే మార్చాలని చూస్తోందని, వారి ఆగడాలను నిలువరించాలంటే ఎన్‌డిఎ కూటమిని ఓడించి, ఇండియా కూటమి ని గెలిపించాలని కోరారు. నల్ల చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన పోరాట సందర్భంలో రైతులకు మోడీ హామీలిచ్చినా వాటిని అమలు చేయలేదని, ఉపాధి హామీకి నిధులు తగించి ఆ చట్టాన్నే నిర్వీర్యం చేస్తున్నారని, కూలీలకు 100 రోజుల పని కలగా మారిందని విమర్శించారు. కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్‌లు గా మార్పు చేసి కార్మికుల హక్కులను హరించారని, జీఎస్టీలో రాష్ట్రాల పన్నుల వాటాను తగ్గించారని, ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు కట్టబెడుతున్నారని, దేశ ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేస్తూ రాజ్యాంగ వ్యవస్థలను ధ్వంసం చేస్తు న్నారని విమర్శించారు. ఇన్ని దారుణాలకు పాల్పడుతున్న బీజేపీని ఇంటికి సగనంపాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామని, ఇల్లు ఇళ్ల స్థలాల కోసం పేదలు గుడిసెలు వేసుకుని ఉంటే కూల్చేస్తున్నారన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
-కార్మికులను పట్టించుకోని బిజెపిని ఓడించాలి
-సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లికార్జున్
కార్మికులను పట్టించుకోని బిజెపిని ఓడించాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లికార్జున్ పిలుపునిచ్చారు. కార్మికులను ఏమాత్రం పట్టించుకోలేదని అనేక పరిశ్రమలు మూతపడి వేలాది ఉద్యోగాలు పోయి రోడ్డున పడ్డారని అన్నారు. దేశ సంపాదన మొత్తం పెట్టుబడుదారులకు తాకట్టు పెట్టారని మండిపడ్డారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు బి మల్లేష్, కోశాధికారి కే రాజయ్య, నాయకులు వాజీద్ అలీ మాట్లాడారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు బి నాగేశ్వరరావు,వి ఎస్ రాజు,అనంత రావు,పద్మారావు, సంతోష్,తిరుపతి, లఖాన్,గంగాధర్,వెంకట్ రామ్ రెడ్డి ,విష్ణు,రమణారెడ్డి,మూర్తి,బివి ఆర్ కె రాజు తది తరులు పాల్గొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…