– సైకత శిల్పం ఫోటో ఫ్రేమ్ అందజేసిన రవీందర్ యాదవ్
మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి :
భారాస ఎమ్మెల్సీ కవితను సీనియర్ నేత రవీందర్ యాదవ్ తన అనుచరులతో కలిసి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రవీందర్ యాదవ్ ను ఎమ్మెల్సీ కవిత అభినందించారు. కవిత జన్మదినం సందర్భంగా ఒడిశా రాష్ట్రం పూరీ తీరాన సైకత శిల్పాన్ని ఏర్పాటు చేయించిన రవీందర్ యాదవ్ కళాకారులతో కలిసి జన్మదిన వేడుకలను నిర్వహించారు. కళాకారులకు, సైకత శిల్పం రూపుదిద్దిన వారికి నూతన వస్త్రాలను అందించారు. ఎమ్మెల్సీ కవిత జన్మదినంను స్వయంగా రవీందర్ యాదవ్ పూరీ తీరాన ఘనంగా నిర్వహించారు. వేడుకలకు సంబంధించి ఎమ్మెల్సీ కవిత అడిగి తెలుసుకున్నారు. పూరీ జగన్నాథ్ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన ప్రసాదాన్ని, సైకత శిల్ప ఫోటో ప్రేమ్ ను కవితకు రవీందర్ యాదవ్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ శేరిలింగంపల్లిలో పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేస్తుండటంపై ప్రశంసలు కురిపించారు. ప్రజా సేవలో ముందుంటున్నారని రవీందర్ యాదవ్ ను కొనియాడారు. శేరిలింగంపల్లిలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా కృషి చేయాలని సూచించారు. కేసీఆర్ నాయకత్వంలో రానున్న ఎన్నికల్లో భారాస అధికారంలోకి రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రవీందర్ యాదవ్ మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో తెలంగాణలో అభివృద్ధి పరుగులు పెట్టిందన్నారు. కాంగ్రెస్ తెలంగాణను నాశనం చేస్తుందని మండిపడ్డారు. పార్టీ కార్యకర్తలకు అండగా ఉండి, కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేస్తామని రవీందర్ యాదవ్ వెల్లడించారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…