Telangana

ఎమ్మెల్యే ఆరోపణలు అవాస్తవం: బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు టి.ఆశిష్ గౌడ్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తమపై చేసిన ఆరోపణలు వాస్తవ విరుద్ధమని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు టి.ఆశిష్ గౌడ్ ఖండించారు. బుధవారం పటాన్ చెరు పట్టణంలోని ఆయన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తన గొయ్యి తాను తవ్వుకుంటూ విమర్శల పాలవుతున్నారని విమర్శించారు. గతంలో ఐలా చైర్మన్ ను ఎమ్మెల్యే బెదిరించిన కేసులో రెండున్నర సంవత్సరాలు శిక్ష పడ్డ విషయం అందరికీ తెలిసిందే అన్నారు. నేను కార్పొరేటర్ గా పోటీ చేసినప్పుడు నన్ను ఓడించడానికి నాపైన టీఆర్ఎస్ అభ్యర్థిని నిలబెట్టి, 13 కోట్లు ఖర్చు చేయించారని అన్నారు. డబ్బులు ఖర్చు పెట్టకుండా పదివేల ఓట్లు సంపాదించడం జరిగిందని గుర్తు చేశారు. నా పైన ఎన్నో తప్పుడు కేసులు బనాయించారని, ఇప్పటికి కూడా ఎమ్మెల్యే, ఎమ్మెల్యే సోదరుడు, ఒక పోలీస్ ఆఫీసర్ కలిసి నాపైన అక్రమ కేసులు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం ఉందన్నారు. వీరు చేసే ఆగడాలను డిజిపిని కలిసి త్వరలోనే ఫిర్యాదు చేస్తామని అన్నారు. బీజేపీరాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కాలు ముఖ్య మాకు టికెట్ ఇప్పివ్వడం తర్వాత, మోసపోయిన బాధితులకు న్యాయం చేయాలని సూచించారు. నాపైన, మా కుటుంబ సభ్యుల పైన, కార్యకర్తల పైన ఎలాంటి హాని జరిగినా పూర్తి బాధ్యత ఎమ్మెల్యేదే అన్నారు. మీరు ఎవరికి ఇబ్బందులు పెట్టకుండా ప్రజలకు న్యాయం చేస్తూ ఉంటే, మేమెందుకు విమర్శలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రాజశేఖర్ రెడ్డి, నరేష్ ముదిరాజ్, నడిమిటి కృష్ణ, సుధాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

10 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

10 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

10 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

10 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

11 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

11 hours ago