Telangana

రాబోయేది కేసీఆర్ ప్రభుత్వమే ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

చిన్న కంజర్లలో బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు షాక్

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ లో చేరిన 50 మంది నాయకులు, కార్యకర్తలు

ప్రజాకంటక ప్రభుత్వానికి త్వరలోనే చరమగీతం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

ఇంద్రేశం మున్సిపల్ పరిధిలోని చిన్నకంజర్ల గ్రామంలో బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీలకు చెందిన కీలక నాయకులు, కార్యకర్తలు పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.ఆదివారం పటాన్‌చెరు పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో కౌన్సిలర్ ఊర్మిళ వెంకట్ రెడ్డి, గ్రామ మాజీ సర్పంచ్ నారాయణ రెడ్డిల అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 50 మంది కార్యకర్తలు గులాబీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నిజ స్వరూపం ప్రజలకు అర్థమైందని అతి త్వరలోనే ప్రజలు చరమగీతం పాడతారని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీని అమలు చేయకపోగా హైడ్రా పేరుతో విధ్వంసం సృష్టిస్తోందని విమర్శించారు. గత రెండున్నర సంవత్సరాలుగా పటాన్‌చెరు నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించడంలో అధికార కాంగ్రెస్ పార్టీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని విమర్శించారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంతో తిరిగి రాష్ట్రంలో గులాబీ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు చెందిన విజయ్ సింగ్, హనుమంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, సాయి, నరేష్ ఈశ్వర్, రాజు, లోకనాథ్ సింగ్, కిరణ్, నబీ, తదితరులు బిఆర్ఎస్ పార్టీలో చేరారు.ఈ కార్యక్రమంలో అమీన్పూర్ మాజీ ఎంపీపీ దేవానందం, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, ఇంద్రేశం మున్సిపల్ కౌన్సిలర్లు ఊర్మిళ వెంకట్ రెడ్డి అంతిరెడ్డి, దుర్గారెడ్డి, కో ఆప్షన్ సభ్యులు శివారెడ్డి, సల్మాన్, సీనియర్ నాయకులు రామచందర్, దుర్గేశ్, సాయికిరణ్ చారి, తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

పటాన్‌చెరు నియోజకవర్గ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే జిఎంఆర్..

ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు, విజయాలు వెల్లివిరియాలి. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పటాన్‌చెరులో అద్భుత ప్రగతి.. పటాన్‌చెరు ,మనవార్తలు…

1 hour ago

108 అంబులెన్స్‌‌లో మహిళ ప్రసవం

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : గర్భిణీ ని ఆసుప్రతికి తరలిస్తుండగా పురిటి నొప్పులు అధికమై 108 అంబులె‌న్స్‌లో ప్రసవించింది. పూర్తి…

1 hour ago

వేముకుంట మహాశక్తి లలితా పోచమ్మ ఆలయంలో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

మనవార్తలు ప్రతినిధి – శేరిలింగంపల్లి : వేముకుంట గౌతమినగర్‌లోని శ్రీ శ్రీ శ్రీ మహాశక్తి లలితా పోచమ్మ దేవాలయంలో ఆదివారం…

1 hour ago

దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న కంజర్ల కృష్ణమూర్తి

మనవార్తలు ప్రతినిధి – శేరిలింగంపల్లి : పటాన్‌చెరు నియోజకవర్గంలో గల భారతీనగర్‌ డివిజన్‌లో నిర్వహించిన సుమారు 19 దేవి శరన్నవరాత్రి…

1 hour ago

కేసీఆర్ నగర్ ఫేజ్-2లో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

రామచంద్రపురం ,మనవార్తలు ప్రతినిధి : ప్రపంచంలో ప్రకృతిని ప్రేమిస్తూ, పూలను పూజించే అరుదైన పండుగ బతుకమ్మ అని తెల్లాపూర్ మున్సిపల్…

21 hours ago

పటాన్చెరులో అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ సంబరాలు..

ఎమ్మెల్యే జిఎంఆర్ ఆధ్వర్యంలో సాకి చెరువు కట్టపై పూల పండుగకు జనసంద్రం.. వేలాదిగా తరలివచ్చిన మహిళలు.. జానపద గీతాలు, సాంస్కృతిక…

1 day ago