మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:
పాత పద్ధతిలోనే ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిలు చెల్లించాలని జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు,రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం పటాన్ చెరు మండలంలోని రుద్రారం దగ్గర ఆర్ కృష్ణయ్య ను బిసి విద్యార్థి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నవీన్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 8 9 వెంటనే రద్దు చేసి పాత పద్ధతిలోనే ఫీజుల రియంబర్స్ మెంట్ బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు. అదే విదంగా ప్రభుత్వ పాఠశాలను మూసి వేసే నిర్ణయాన్ని వెంటనే వెనెక్కి తీసుకోవాలని, లేనిపక్షంలో విద్యార్థుల పక్షాన జిల్లాలో ఎత్తున ఆందోళనలు చేపడతామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంగం నాయకులు వెంకట్, సంతు, మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…