శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి :
శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ బాధ్యాయుతమైన స్థానం లో వుండి అబద్దాలు మాట్లాడుతున్నాడని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కోరడల నరేష్ అన్నారు. గురువారం రోజు హాఫిజ్ పేట్ డివిజన్ లోని అల్విన్ కాలనీ వద్ద గల బిజెపి కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో అయన మాట్లాడుతూ 9 వేల కోట్ల తో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని చెప్పుకుంటున్న అయన ఎక్కడ అభివృద్ధి చేసారో చెప్పాలని, ఖర్చు పెట్టిన నిధులు మీద శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులు కాకుండా కేంద్ర ప్రభుత్వo నిదులెన్ని, కార్పొరేటర్ల నిదులెన్ని, ఎంపీ నిదులెన్ని, జి హెచ్ ఎం సి నిదులెన్ని అని ప్రశ్నించారు. వాస్తవ పరిస్థితి కు భిన్నంగా ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడని, అన్ని నిధులు తానే తెచ్చి అభివృద్ధి చేశానని గొప్పలు చెప్పుకుంటూ, చెరువుల సుందరికరుణ పేరుతో కబ్జాలు చేశారని ఆరోపించారు. చిన్న వర్షం వస్తేనే రోడ్లు అన్ని నిండిపోతున్నాయని, ఎన్ని చెరువులు సుందరికరణ చేసారో చెప్పాలని, బడా బిల్డర్ కు అనుకూలంగా కింది కుంట చెరువును అభివృద్ధి చేశారని పేర్కొన్నారు.
మియాపూర్ పటేల్ చెరువు సుందరికరణ పేరుతో నాలా మీద నిర్మాణాలు చేస్తున్నారని, చాలా కట్టాడాలు నాలా ల మీద కడుతున్నారని, ఏ ప్రత్తిపాధికనా ఖర్చు చేసారో చెప్పాలన్నారు. ఎమ్మెల్యే ఎన్ని నిధులు ఖర్చు చేసారో చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు.శేరిలింగంపల్లి నియోజకవర్గం తెలంగాణ లోనే అత్యధిక ఆదయం కలిగిన నియోజకవర్గమని, ఎలక్షన్ ల ముందు మరోసారి ప్రజలను మోసం చేస్తున్నాడని దుయ్యబట్టారు. ప్రభుత్వ స్థలాలను వేలం పాఠం లో అమ్ముతున్నారని, డబల్ బెడ్ రూమ్ లకు శేరిలింగంపల్లి ప్రజలు అర్హులు కారా, ఇల్లు లేని ప్రజలు ఏమైపోవాలని, ఒక్కరికైనా డబుల్ బెడ్ రూమ్ ఇప్పించడా, యువత కోసం ఒక్క స్టేడియం కట్టిన పాపాన పోలేదన్నారు. శేరిలింగంపల్లి ప్రజలకు చేసింది ఏమి లేదని, వాస్తవాలను ప్రజలకు చెప్పలని, తక్షణమే శ్వేత పత్రం విడుదల చేయాలని అయన డిమాండ్ చేసారు.నేను కూడా ఎమ్మెల్యే బరిలో ఉన్నా శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి గా బిజెపి తరుపున బరిలో ఉన్నానని, తన సేవలు అధిష్టానం గుర్తించి అవకాశం కల్పించాలని కోరుతున్నట్లు తెలిపారు. పార్టీ లో ఎవరికీ టికెట్ ఇచ్చినా కలసిపనిచేస్తామని తెలిపారు.
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…
గీతం ఆతిథ్య ఉపన్యాసంలో జాతీయ భౌతిక ప్రయోగశాల డైరెక్టర్ ప్రొఫెసర్ ఆచంట వేణుగోపాల్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక…
ప్రముఖ సినీనటి నివేతా పెతురాజ్ వికేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :…
సంప్రదాయాల సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రదర్శించిన విద్యార్థులు\\ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గురువారం సంక్రాంతి…
భారతి నగర్ డివిజన్లో 2026 డైరీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి రామచంద్రాపురం ,మనవార్తలు…
కేసీఆర్ కోటలో హస్తం హవా మెజార్టీ గ్రామాలలో కాంగ్రెస్ జయకేతనం గజ్వెల్ నియోజకవర్గ కాంగ్రెస్ సర్పంచ్ లకు ఘన సన్మానం…