Telangana

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో

అదనపు తరగతి గదుల ప్రారంభోత్సవం

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో చేపడుతున్న సంస్కరణల మూలంగా ప్రభుత్వ విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు రావడంతో పాటు, విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్నారని పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం అందించే నిధులతో పాటు వివిధ పరిశ్రమల సహాయ సహకారాలతో నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేస్తున్నామని తెలిపారు. పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల లో మన ఊరు మన బడి పథకం ద్వారా 67 లక్షల రూపాయలతో నిర్మించిన 4 అదనపు తరగతి గదులు, ఆర్డిసి కాంక్రీట్ ఇండస్ట్రీస్ సి ఎస్ ఆర్ నిధులతో 10 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించిన మరో రెండు అదనపు తరగతి గదులను సోమవారం ఆయన ప్రారంభించారు. విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేస్తూ, నాణ్యమైన విద్యను అందిస్తుందని తెలిపారు. పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని ప్రతి ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడంతో పాటు ఆధునిక వసతులతో విద్యాబోధనను అందిస్తున్నామని పేర్కొన్నారు.ప్రభుత్వ విద్యా సంస్థల్లో విద్యను అభ్యసించిన విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ కంపెనీలలో ఉద్యోగాలు సాధిస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు. పది లక్షల రూపాయల సి ఎస్ ఆర్ నిధులతో పాఠశాలకు రంగులు వేయించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, మండల విద్యాశాఖ అధికారి నాగేశ్వరరావు నాయక్, పంచాయతీరాజ్ డిఇ సురేష్, ప్రమోద్ గౌడ్, ఆర్డిసి పరిశ్రమ ప్రతినిధి నరేష్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

admin

Recent Posts

గీతంలో అంతర్జాతీయ సదస్సు

జంతు అధ్యయనాల నుంచి ఔషధ ఆవిష్కరణ, అనువాద పరిశోధనపై చర్చ పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : భారతదేశంలోని ప్రయోగశాల…

1 week ago

విద్యతో పాటు క్రీడలు ఎంతో అవసరం పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి.

పటాన్ చెరులో ఘనంగా ప్రారంభమైన నియోజకవర్గస్థాయి ప్రైవేటు పాఠశాలల క్రీడా పోటీలు పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : ప్రస్తుత…

2 weeks ago

జాతీయ, అంతర్జాతీయ సదస్సులలో విశిష్ట వక్తగా గీతం అధ్యాపకురాలు ప్రొఫెసర్ ప్రీతి

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, సీఎస్ఈ విభాగం ప్రొఫెసర్ ప్రీతి అంబరీష్…

2 weeks ago

రాష్ట్ర, జాతీయ క్రీడలకు చిరునామా పటాన్ చెరు _ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్ చెరులో ఘనంగా ముగిసిన రాష్ట్ర స్థాయి అంతర్ జిల్లా కోకో క్రీడలు విజేతలకు బహుమతులు అందించిన ఎమ్మెల్యే జిఎంఆర్…

2 weeks ago

మహిళా విద్యకు మార్గదర్శకుడు ఫూలే : నీలం మధు ముదిరాజ్

ఫూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : శుక్రవారం జ్యోతిరావు ఫూలే 135వ వర్ధంతి…

2 weeks ago

పటాన్ చెరులో ఘనంగా ప్రారంభమైన అంతర్ జిల్లా రాష్ట్రస్థాయి కోకో క్రీడోత్సవాలు

-లాంచనంగా ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ -క్రీడలు, క్రీడాకారులకు సంపూర్ణ సహకారం పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : విద్యార్థి దశ…

2 weeks ago