Telangana

అబ్దుల్ కలాం జీవితం నేటితరం యువతకు స్ఫూర్తిదాయకం పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరులో ఘనంగా మిస్సైల్ మాన్ అబ్దుల్ కలాం జయంతి వేడుకలు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

అత్యంత సామాన్య కుటుంబం నుండి జీవితాన్ని ప్రారంభించి.. భారతదేశ అత్యున్నత రాష్ట్రపతి పదవి చేపట్టడంతో పాటు రక్షణ రంగంలో మిస్సైల్ మెన్ గా గుర్తింపు పొందిన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జీవితం నేటితరం యువతకు స్ఫూర్తిదాయకమని పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. డాక్టర్ అబ్దుల్ కలాం జయంతిని పురస్కరించుకొని.. పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో గల అబ్దుల్ కలాం కాంస్య విగ్రహానికి ఎమ్మెల్యే జిఎంఆర్ పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ.. అబ్దుల్ కలాం ఆశయాలను భవిష్యత్తు తరాలకు అందించాలన్న సమున్నత లక్ష్యంతో ప్రత్యేకంగా కేజీ టు పీజీ విద్యా ప్రాంగణంలోనే ఆయన కాంస్య విగ్రహాన్ని సొంత నిధులతో ఏర్పాటు చేయడం జరిగిందని గుర్తు చేశారు. ప్రతిరోజు ఆయన విగ్రహాన్ని చూసినప్పుడల్లా ప్రతి విద్యార్థి అబ్దుల్ కలాం జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. నేటితరం విద్యార్థులు చదువుతోపాటు క్రీడలపై ఆసక్తి పెంపొందించుకోవాలని కోరారు. ప్రస్తుత సమాజాన్ని పట్టిపీడిస్తున్న మాదకద్రవ్యాలను తరిమికొట్టాల్సిన గురుదర బాధ్యత విద్యార్థి లోకంపైన ఉందన్నారు.ఈ కార్యక్రమంలో పటాన్‌చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నరసింహారెడ్డి, గూడెం మధుసూదన్ రెడ్డి, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ అశోక్, పట్టణ పుర ప్రముఖులు, సీనియర్ నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

9 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

10 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

10 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

10 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

10 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

10 hours ago