పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
దశాబ్దాల కాలపు ప్రజల పోరాట ఫలితమే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటని, అమరుల త్యాగాలను స్మరించుకుంటూ.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా.. ప్రతి ఒక్కరి భాగస్వామ్యం.. తోడ్పాటుతో పటాన్చెరు నియోజకవర్గాన్ని. అభివృద్ధికి ప్రతీకగా తీర్చిదిద్దుతున్నామని స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు..తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకొని.. పటాన్చెరు డివిజన్ పరిధిలోని జిహెచ్ఎంసి కార్యాలయం, మార్కెట్ కమిటీ కార్యాలయం, ఎంపీడీవో, తహసిల్దార్ కార్యాలయాల ఆవరణలో ఏర్పాటుచేసిన జాతీయ జెండా ఆవిష్కరణల కార్యక్రమానికి ఎమ్మెల్యే జి.ఎం.ఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం పట్టణంలోని తెలంగాణ అమరవీరుల స్థూపానికి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కోసం తొలిదశ పోరాటం బీజం వేయగా.. మలిదశ పోరాటంలో. సబ్బండ వర్గాలు ఒక్క తాటిపై నిలిచి సుదీర్ఘ స్వప్నాన్ని సాకారం చేసుకున్న మరుపు రాని రోజు అన్నారు. పటాన్చెరు నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టడంతో పాటు ప్రతి కుటుంబానికి ఆర్థిక స్వావలంబనను అందించడం జరిగిందని తెలిపారు. విద్యా వైద్యరంగంలో వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టి పేదవాడికి కార్పొరేట్ వైద్యం అందించడంతోపాటు ప్రతి విద్యార్థికి ఉచితంగా కేజీ నుండి పేజీ వరకు విద్యను అందించడం జరిగిందని తెలిపారు.ప్రజలందరి సహాయ సహకారాలతో రాబోయే రోజుల్లో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుని వెళ్తామని అన్నారు.
ఈ కార్యక్రమాల్లో పటాన్చెరు కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, మాజీ కార్పొరేటర్ సపనా దేవ్, గూడెం మధుసూదన్ రెడ్డి, బల్దియా డిప్యూటీ కమిషనర్ సురేష్, ఎమ్మార్వో రంగారావు, ఎంపీడీవో యాదగిరి, వివిధ శాఖల అధికారులు, సీనియర్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…
గీతం ఆతిథ్య ఉపన్యాసంలో జాతీయ భౌతిక ప్రయోగశాల డైరెక్టర్ ప్రొఫెసర్ ఆచంట వేణుగోపాల్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక…
ప్రముఖ సినీనటి నివేతా పెతురాజ్ వికేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :…
సంప్రదాయాల సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రదర్శించిన విద్యార్థులు\\ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గురువారం సంక్రాంతి…
భారతి నగర్ డివిజన్‌లో 2026 డైరీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి రామచంద్రాపురం ,మనవార్తలు…
కేసీఆర్ కోటలో హస్తం హవా మెజార్టీ గ్రామాలలో కాంగ్రెస్ జయకేతనం గజ్వెల్ నియోజకవర్గ కాంగ్రెస్ సర్పంచ్ లకు ఘన సన్మానం…