పటాన్చెరు డి.ఎస్.పి భీమ్ రెడ్డి
ఐలాపూర్ గ్రామంలో బుధవారం ఉదయం జరిగిన గొడవ కేసులో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కి ఎటువంటి సంబంధం లేదని పటాన్చెరు డీఎస్పీ భీమ్ రెడ్డి తెలిపారు. బుధవారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రాయన గుట్ట కు చెందిన ఇద్దరు వ్యక్తులకు ఐలాపూర్ గ్రామంలో భూములు ఉన్నాయని, ఇందుకు సంబంధించి హైకోర్టులో కేసు నడుస్తోందని తెలిపారు. తమ భూముల్లో సర్పంచి రవి గృహాలు నిర్మించి అమ్మేస్తున్నారని తెలియడంతో , విషయం తెలుసుకునేందుకు సంఘటన స్థలానికి వారు వచ్చారని తెలిపారు. వారి దగ్గర లైసెన్సు రివాల్వర్లు ఉన్నాయని పేర్కొన్నారు. సర్పంచ్ రవి గ్రామస్తులతో కలిసి దాడి చేసేందుకు ప్రయత్నించడంతో, తుపాకులు బయటకు తీశారు అని తెలిపారు. ఈ విషయంలో నిందితులకు, భూములకు సంబంధించి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కి ఎటువంటి సంబంధం లేదని డిఎస్పి భీమ్ రెడ్డి తెలిపారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతున్నామని తెలిపారు.
తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: సనాతన ధర్మాన్ని యావత్ ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు స్వామి వివేకానంద అని పటాన్ చిరు…
స్వామి వివేకానంద 163వ జయంతి సందర్భంగా విజయవాడలో ఘన సన్మానం మనవార్తలు ,విజయవాడ: స్వామి వివేకానంద 163వ జయంతిని పురస్కరించుకుని…
దేశ ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేసిన మహనీయుడాయన ఆయన స్ఫూర్తితో యువత ముందుకు సాగాలి నీలం మధు ముదిరాజ్ చిట్కుల్ లో…
జాతీయ స్థాయి అండర్ 14 కబడ్డీ పోటీలలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన తెలంగాణ జట్టు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:…
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి విన్నవించిన పాటి గ్రామస్తులు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ముత్తంగి డివిజన్ పాటి గ్రామ…