మనవార్తలు , పటాన్ చెరు
అర్హులైన ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కోరారు. గురువారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని బండ్లగూడలో అక్షయపాత్ర సౌజన్యంతో ఏర్పాటు చేసిన ప్రత్యేక కోవిడ్ టీకా కార్యక్రమాన్ని పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ వ్యాక్సినేషన్ పట్ల ఎవరు ఎలాంటి అపోహలు చెందాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు.
ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రత్యేక శ్రద్ధతో వ్యాక్సినేషన్ పక్రియ సమర్ధవంతంగా నిర్వహించిన మూలంగానే థర్డ్ వేవ్ సమయంలో మరణలా సంఖ్య, ఆస్పత్రిలో చేరడం గణనీయంగా తగ్గిందని అన్నారు. వ్యాక్సింగ్ వేసుకున్న వారికి పది రోజుల పాటు నిత్యావసర సరుకులు అందిస్తూ ప్రోత్సహిస్తున్నా అక్షయ పాత్ర ఫౌండేషన్ ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు విజయ్ కుమార్, గోపాల్, చంద్రశేఖర్, అక్షయపాత్ర ఫౌండేషన్ సభ్యులు, కాలనీవాసులు, తదితరులు పాల్గొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…