Districts

ఆస్రా ఫాతిమాకు డాక్టరేట్…

మనవార్తలు ,పటాన్ చెరు:

బిల్ట్ , ఆపరేట్ , ట్రాన్స్ఫర్ ( బీవోటీ ) ప్రాజెక్టులలో ఆర్టిఫీషియల్ న్యూరల్ నెట్వర్క్ ( ఏఎన్ఎన్ ) ని ఉపయోగించి నిర్మాణ వివాదాన్ని ప్రభావితం చేసే కారణాలపై అధ్యయనం , విశ్లేషణ , దానికి సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన హెదరాబాద్ , గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని సివిల్ ఇంజనీరింగ్ విభాగం పరిశోధక విద్యార్థిని ఆప్రా ఫాతిమాను డాక్టరేట్ వరించింది . ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని సివిల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి ప్రొఫెసర్ బీఎస్ఆర్కే ప్రసాద్ గురువారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు . నిర్మాణ పరిశ్రమలో బీవోటీ ప్రాజెక్టులను ప్రభావితం చేసే కారకాల గుర్తింపు కోసం ఈ అధ్యయనం చేపట్టామన్నారు .

వివాదాన్ని ప్రేరేపించడానికి కారణమైన కీలక కారణాలను గుర్తించి , వాటిని విశ్లేషించడం , ఏఎన్ఎన్ ఉపయోగించి వివాదాన్ని అంచనా వేయడానికి ఒక నమూనాను అభివృద్ధి చేయడం ఈ పరిశోధన లక్ష్యంగా ఆయన వివరించారు . ప్రాజెక్టు ఖర్చు , సమయాన్ని ప్రభావితం చేసి 53 కారకాలు సర్వేల ద్వారా వెల్లడయ్యాయన్నారు . ఏఎమ్ఎన్ ఆధారంగా ఒక అంచనాకు వచ్చే నమూనాను అభివృద్ధి చేయడానికి ఈ కారకాలను ఉపయోగించామని తెలిపారు . సంపూర్ణ విచలనం ( ఎంఏపీడీ ) తో బ్యాక్ ప్రొపగేషన్ అల్గారిథమ్ ఆధారంగా 4-0-1 ఫీడ్ ఫార్వర్డ్ న్యూరల్ నెట్వర్క్ ఉత్తమంగా అంచనా వేసి నమూనాను కనుగొన్నట్టు ఆయన పేర్కొన్నారు .

ఈ ఫలితాలను పది రహదారి , రెండు విద్యుత్ ఉత్పత్తి , ఒక మెట్రో రెల్లు ప్రాజెక్టులతో అన్వయించి ధృవీకరించుకున్నట్టు తెలిపారు . ఫాతిమా సమర్పించిన సిద్ధాంత వ్యాసం పీహెచీ పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం విశ్వవిద్యాలయం , హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్ . శివప్రసాద్ , గీతం రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ , డెరైక్టర్ – ఇంజనీరింగ్ ప్రొఫెసర్ నీకే మిట్టల్ , స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అసోసియేట్ డెరైక్టర్ ప్రొఫెసర్ ఎన్.సీతారామయ్య , పలు విభాగాల అధిపతులు , అధ్యాపకులు , సిబ్బంది పలువురు అభినందించినట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు .

Ramesh

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

6 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

7 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

7 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

7 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

7 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

7 hours ago