Hyderabad

మత్స్యకారుల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్చెరు

తెలంగాణ రాష్ట్రంలో నీలి విప్లవం తీసుకొని రావాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనల మేరకు మత్స్య శాఖ ను బలోపేతం చేస్తూ ప్రతి చెరువులో లక్షల చేప పిల్లలను విడుదల చేస్తున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం మత్స్య శాఖ ఆధ్వర్యంలో పటాన్చెరు పట్టణ పరిధిలోని సాకీ చెరువు, తిమ్మక్క చెరువు, తీగల నాగారం చెరువు, దోషం చెరువులలో ఏడు లక్షల రూపాయల విలువైన మూడున్నర లక్షల చేప పిల్లలను విడుదల చేశారు.

ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ పటాన్చెరు నియోజకవర్గ పరిధిలో 42 సొసైటీల ద్వారా 70 లక్షల రూపాయల విలువైన 35 లక్షల చేప పిల్లలను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. మత్స్యకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, మంచి లాభాలు గడించాలని కోరారు.

మత్స్యకారుల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ కుమార్ గౌడ్, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మత్స్య శాఖ జిల్లా అధికారి సతీష్, పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్జల్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు విజయ్ కుమార్, తులసి దాస్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

ఇక చదవండి

తల్లిదండ్రులు లేని బాలుడి కోరిక తీర్చిన మధు ముదిరాజ్ సైకిల్

కన్నుల పండుగగా గీతం పన్నెండో స్నాతకోత్సవం

Ramesh

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago