Telangana

శరవేగంగా అభివృద్ధి పనులు పూర్తి చేయాలి_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

గ్రామీణ ప్రాంతాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులను నిర్దేశించిన గడువులోగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రావాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అధికారులకు సూచించారు.బుధవారం పటాన్చెరు పట్టణంలోని జిఎంఆర్ ఫంక్షన్ హాల్ లో అభివృద్ధి పనులపై నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ధి పనుల ప్రగతి పై సమీక్ష నిర్వహించారు.ప్రత్యేక తెలంగాణ ఏర్పడి అనంతరం దశాబ్దికాలంలో నియోజకవర్గ వ్యాప్తంగా తొమ్మిది వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లోనూ ఇదే స్పూర్తితో పని చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వాలు మారిన అభివృద్ధి పనుల విషయంలో నిర్లక్ష్యానికి తావివ్వకూడదని సూచించారు. ప్రధానంగా పంచాయతీరాజ్, గ్రామీణ నీటిపారుదల, విద్యుత్, రెవెన్యూ, వ్యవసాయం తదితర శాఖల అధికారులు ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ అభివృద్ధి పనులకు రూపకల్పన చేయాలని ఆదేశించారు. పెండింగ్లో ఉన్న పనులను సకాలంలో పూర్తి చేయాలని, నిధుల కొరత ఉంటే తనను సంప్రదించాలని కోరారు. ప్రభుత్వం అందించే నిధులతోపాటు సిఎస్ఆర్ ద్వారా నిధులను కేటాయించడం జరుగుతుందని తెలిపారు.నియోజకవర్గం కేంద్రమైన పటాన్చెరు లోని వ్యవసాయ మార్కెట్ యార్డును విస్తరిస్తున్నామని, యార్డ్ సమీపంలో గల రైల్వే శాఖకు సంబంధించిన 20 ఎకరాల భూమిని మార్కెట్ యార్డ్ కు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వానికి విన్నవించడం జరిగిందని తెలిపారు.ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేస్తూ ప్రజలకుజవాబుదారీగా పని చేయాలని సూచించారు.ఈ సమావేశంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, ఎంపీపీలో సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి, దేవానందం, ప్రవీణ విజయభాస్కర్ రెడ్డి, జెడ్పిటిసిలు సుప్రజా వెంకట్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, కుమార్ గౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, వైస్ ఎంపీపీ లు, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

admin

Recent Posts

వందేమాతరం సామూహిక గీతాలాపన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…

2 days ago

ఇష్టా విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఘనంగా ఐఐటి రామయ్య జన్మదిన వేడుకలు

చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…

2 days ago

గీతంలో ఉల్లాసంగా కేక్ మిక్సింగ్ వేడుక

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…

2 days ago

తాగునీటి పంపిణీలో ఇబ్బందులు తలెత్తితే ఉద్యమాలకు సిద్ధం

రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…

1 week ago

కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్న బిస్లరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…

1 week ago

శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో సెమినార్

నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…

1 week ago