_ప్రతి ఇంటికి ఆసరా.. ప్రతి గడపకి సంక్షేమం
_తెలంగాణలో సంక్షేమ పథకాల పండుగ
_శరవేగంగా దళిత బంధు, బీసీ బందు, గృహ లక్ష్మి పథకాల లబ్ధిదారుల ఎంపిక
_ప్రజల కోసం 24 గంటలు పనిచేసేందుకు నేను సిద్ధం..
పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :
స్వరాష్ట్రంలో సబ్బండ వర్గాలకు భరోసాను అందిస్తూ.. ప్రతి పేదవాడి ఆర్థిక అభ్యున్నతి లక్ష్యంగా ఇంట్లో సంక్షేమం ఇంటి ముంగిట అభివృద్ధి లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం పనిచేస్తోందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.మంగళవారం ఉదయం పటాన్చెరు పట్టణంలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్ లో ఎమ్మెల్యే జిఎంఆర్ అధ్యక్షతన..నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో కలిసి సంక్షేమ పథకాల అమలుపై సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ.. రాబోయే మూడు నెలల్లో దళిత బంధు, బీసీ బందు, గృహలక్ష్మి, అర్హులైన నిరుపేదలకు 75 గజాల ఇళ్ల స్థలం పథకాలను పూర్తిస్థాయిలో లబ్ధిదారులకు అందజేయాలని ఆదేశించారు. లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకతను పాటిస్తూ, చివరి లబ్ధిదారుడికి సైతం పథకాలు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.
దళితుల ఆర్థిక స్వావలంబన కోసం సీఎం కేసీఆర్ దేశంలోనే మొట్టమొదటిసారిగా దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టి, లబ్ధిదారుడికి నేరుగా 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తూ వారి జీవనోపాధికి అండగా నిలుస్తున్నారని తెలిపారు.పటాన్చెరు నియోజకవర్గంలో పైలెట్ ప్రాజెక్టుగా పటాన్చెరు, జిన్నారం, గుమ్మడిదల మండలాల పరిధిలో వంద మంది లబ్ధిదారులకు దళిత బంధు ద్వారా వివిధ యూనిట్లు మంజూరు చేసి, వ్యాపారాలు విజయవంతంగా నిర్వహించేలా అండగా నిలిచామని తెలిపారు..రెండో విడతగా నియోజకవర్గానికి 1100 యూనిట్లు మంజూరయ్యాయని తెలిపారు. పటాన్చెరు నియోజకవర్గ పరిధిలో నాలుగు మండలాలు, మూడు మున్సిపాలిటీలు, మూడు కార్పొరేటర్ల డివిజన్లకు వందమంది లబ్ధిదారుల చొప్పున అర్హులను ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు.కులవృత్తిని నమ్ముకొని జీవనం సాగిస్తున్న బీసీలకు ఆర్థిక చేయూతను అందించాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ ఇటీవల బీసీ బందు పథకాన్ని ప్రవేశ పెట్టడం జరిగిందని పేర్కొన్నారు. పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా 1722 మందిని అర్హులుగా గుర్తించడం జరిగిందని తెలిపారు. విడతల వారీగా అర్హులందరికీ లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తామని తెలిపారు.
సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్న నిరుపేదలకు ప్రభుత్వం గృహలక్ష్మి పథకం ద్వారా మూడు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తుందని తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని మూడు వేల మంది లబ్ధిదారులకు గృహలక్ష్మి పథకం ద్వారా లబ్ధి జరగనుందని తెలిపారు. త్వరితగతిన లబ్ధిదారులను ఎంపిక చేయాలని ఆయన అధికారులకు ఆదేశించారు.గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాలను గుర్తించి అర్హులైన నిరుపేదలకు 75 గజాల ఇళ్ల స్థలం ఇచ్చేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. అతి త్వరలో ఇందుకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభం కానుందని తెలిపారు.
వీటితోపాటు నియోజకవర్గ పరిధిలోని అర్హులైన యువతి యువకులకు సొంత నిధులచే ఉచిత డ్రైవింగ్ లైసెన్సులు అందించనున్నట్లు ఎమ్మెల్యే జిఎంఆర్ ప్రకటించారు. అర్హత ఉన్నప్పటికీ డ్రైవింగ్ లైసెన్సులు తీసుకోకపోవడం మూలంగా యువత ప్రమాదాలకు గురవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. యువతి యువకులు తమ ధ్రువీకరణ పత్రాలతో స్థానిక ప్రజా ప్రతినిధులకు తమ దరఖాస్తును అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేసిన ప్రతి ప్రతి ఒక్కరిని అతి త్వరలో సన్మానించుకోనున్నట్లు తెలిపారు.ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేస్తున్న అర్హులైన జర్నలిస్టులు అందరికీ ఈ నెలలోనే ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం పూర్తి చేయనున్నట్లు తెలిపారు.
దేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రజల సంక్షేమం కోసం ఇలాంటి వినూత్న పథకాలను ప్రవేశపెట్టి మనసున్న మహారాజుగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల మన్ననలు పొందుతున్నారని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.ఎన్నికల కోడ్ వచ్చేలోపు ప్రతి పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని కోరారు. ఎందుకు అనుగుణంగా గ్రామస్థాయి నుండి నియోజకవర్గ స్థాయి వరకు అన్ని స్థాయిల అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి ప్రభుత్వ లక్ష్యాన్ని విజయవంతం చేయాలని కోరారు.నియోజకవర్గ ప్రజల కోసం 24 గంటలు పని చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఆయన తెలిపారు.ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రతి ఒక్కరూ పూర్తి బాధ్యతతో పనిచేయాలని కోరారు.
ఈ సమావేశంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, డిఆర్డిఏ పిడి శ్రీనివాసరావు, ఆర్డీవో రవీందర్ రెడ్డి, బీసీ కార్పొరేషన్ ఈడీ జగదీష్ ఎస్సీ కార్పొరేషన్ ఈడీ చారి, జెడ్పిటిసిలు సుధాకర్ రెడ్డి, కుమార్ గౌడ్, మున్సిపల్ చైర్మన్లు లలిత సోమిరెడ్డి, పాండురంగారెడ్డి, కార్పొరేటర్లు సింధు ఆదర్శ్ రెడ్డి, పుష్ప నగేష్, మెట్టు కుమార్ యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, ఆత్మ కమిటీ చైర్మన్ కుమార్ గౌడ్, సీనియర్ నాయకులు బాల్ రెడ్డి, దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, చంద్రారెడ్డి, వెంకటేష్ గౌడ్, చంద్రశేఖర్ రెడ్డి, అమీన్పూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, తహసిల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…