Telangana

నేడు పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా బిఆర్ఎస్ పార్టీ నిరసనలు

_తెలంగాణ రైతాంగం పట్ల కాంగ్రెస్ పార్టీ వైఖరిని నిరసిస్తూ నిరసనలు

_ఇస్నాపూర్ నిరసనలో పాల్గొననున్న ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

తెలంగాణ రైతన్నకి 24 గంటలు ఉచిత విద్యుత్ వద్దు అంటూ కాంగ్రెస్ పార్టీ  అధ్యక్షుడి ప్రకటనను నిరసిస్తూ టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు నేడు పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టబోతున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.రాష్ట్రంలో ఉచిత విద్యుత్తు అవసరం లేదంటూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రకటన తెలంగాణ రైతాంగం పట్ల కాంగ్రెస్ పార్టీ వైఖరినీ అద్దం పడుతోందని విమర్శించారు. ఉచిత విద్యుత్ కార్యక్రమాన్ని రద్దు చేయాలన్న దుర్మార్గపు ఆలోచన కాంగ్రెస్ పార్టీదన్నారు. గతంలో కూడా విద్యుత్ ఇవ్వకుండా రైతులను గోసపెట్టిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాలదని విమర్శించారు.పటాన్చెరు మండలం ఇస్నాపూర్ చౌరస్తాలో నిర్వహించబోయే నిరసన కార్యక్రమంలో తన స్వయంగా పాల్గొననున్నట్లు తెలిపారు.నియోజకవర్గ పరిధిలోని అన్ని మండల కేంద్రాలు, మున్సిపాలిటీలు, జిహెచ్ఎంసి డివిజన్ కేంద్రాలలో కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మలు దహనం చేసి, ఆ పార్టీ వైఖరిని ఎండగట్టాలని ఆయన పిలుపునిచ్చారు.నియోజకవర్గ పరిధిలోని అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో నిరసన కార్యక్రమాల్లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

10 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

11 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

11 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

11 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

11 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

11 hours ago