కాలనీలలో మౌళిక వసతుల కల్పనకు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నట్లు పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఉదయం పటేల్ గూడ గ్రామ పరిధిలోని సిద్ధార్థ కాలనీలో ఇరవై నాలుగు లక్షల రూపాయలతో నిర్మించిన సిసి రోడ్డును ఆయన ప్రారంభించారు. అనంతరం 40 లక్షల రూపాయలతో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్ పనులకు భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ ప్రతి కాలనీలో అంతర్గత మురుగునీటి కాలువలు, సిసి రోడ్లు, వీధి దీపాలు, రక్షిత మంచినీరు, పారిశుద్ధ్యం తదితర మౌలిక వసతుల కల్పనకు ప్రణాళికాబద్ధంగా నిధులు అందిస్తున్నట్లు తెలిపారు.
నిరంతరం ప్రజల మధ్యనే ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేసినప్పుడే ప్రజల విశ్వాసాన్ని పొందగలుగుతామని అన్నారు. తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ప్రతి జిల్లాకు కావలిసిన సదుపాయాలను సమకూరుస్తుందని అమీన్పూర్ మండలం దినదిన అభివృద్ధి చెందుతుందని మహిపాల్ రెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ దేవానందం, జడ్పిటిసి సుధాకర్ రెడ్డి, సర్పంచ్ ఈర్ల నితిషా శ్రీకాంత్, స్థానిక ప్రజా ప్రతినిధులు, కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…