మనవార్తలు ,పటాన్ చెరు:
ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు అందించాలన్న సమున్నత లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన మిషన్ భగీరథ పథకాన్ని ప్రతి కాలనీకి విస్తరిస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం రాత్రి పటాన్చెరు డివిజన్ పరిధిలోని కృషి డిఫెన్స్ కాలనీ లో ఇంటింటికి మిషన్ భగీరథ పైప్ లైన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కాలనీవాసులు ఎమ్మెల్యేని ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఒకప్పుడు కాలుష్యానికి కేరాఫ్ అడ్రస్గా నిలిచిన పటాన్చెరు నియోజకవర్గం నేడు గేటెడ్ కమ్యూనిటీ లకు సెంటర్ గా మారుతోందని ఆనందం వ్యక్తం చేశారు. ప్రతి కాలనీ అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే నూతన కాలనీలకు మిషన్ భగీరథ విస్తరించాలని జలమండలి అధికారులను కోరడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు విజయ్ కుమార్, కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు, కాలనీవాసులు పాల్గొన్నారు
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…