Telangana

అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే …

అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే…

అమీన్ పూర్:

అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో మౌళిక వసతుల కల్పనకు ప్రణాళికాబద్ధంగా నిధులు కేటాయిస్తున్నట్లు పటాన్చెరువు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. శనివారం మున్సిపల్ పరిధిలోని లింగమయ్య కాలనీ లో పది లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న సిసి రోడ్ల పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజురోజుకీ విస్తరిస్తున్న అమీన్పూర్ మున్సిపాలిటీలో సిసి రోడ్లు, మంచినీటి సౌకర్యం, పారిశుద్ధ్యం పనులకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో అభివృద్ధి కార్యక్రమాలకు రూపకల్పన చేయాలని సూచించారు.  ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగ రెడ్డి, వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, మున్సిపల్ కమిషనర్ సుజాత, కౌన్సిలర్లు, అధికారులు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Ramesh

Recent Posts

పటాన్చెరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నిర్మాణానికి సహకరించండి

తోషిబా యాజమాన్యాన్ని కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్.. మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: పటాన్‌చెరుప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, హాస్టల్ భవనాల నిర్మాణాలకు…

7 hours ago

ఇష్టపడి చదవండి లక్ష్యాన్ని సాధించండి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పదో తరగతి విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస నిపుణులచే ప్రత్యేక తరగతులు ప్రారంభం 8 వేల మంది విద్యార్థులకు సొంత నిధులచే…

7 hours ago

గీతంలో ప్రమాణ కోసం సర్వం సిద్ధం

ప్రతిభ, అనుభవపూర్వక అభ్యాసంతో అబ్బురపరచనున్న వార్షిక వేడుక మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వార్షిక ఉత్సవం…

8 hours ago

ప్రభుత్వ భూములను కాపాడాలి

అమీన్‌పూర్‌లో ప్రభుత్వ భూముల కబ్జా తహసీల్దార్‌కు వినతి పత్రం అందించిన మాజీ వైస్ ఎంపీపీ, మాజీ వార్డు సభ్యు లు…

8 hours ago

ప్రతి అధికారి క్షేత్రస్థాయిలో పర్యటించండి

విద్యుత్, మంచినీరు, పరిశుభ్రత అంశాలకు ప్రథమ ప్రాధాన్యత బల్దియా పరిధిలోని ప్రతి ఇంటికి స్వచ్ఛ జలాలు ప్రతి కాలనీలో పచ్చదనం…

2 days ago

అంతర్జాతీయ సదస్సులో గీతం అధ్యాపకుడికి ఉత్తమ పత్ర అవార్డు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం అధ్యాపకుల కృషి మరోసారి విద్యారంగ నిపుణుల ప్రశంసలను అందుకుంది. హైదరాబాదులోని గీతం స్కూల్…

2 days ago