Hyderabad

ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావుకు ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్చెరు

పటాన్చెరులో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకున్న సందర్భంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు కు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. సోమవారం ఉదయం నియోజకవర్గ ప్రజాప్రతినిధులతో కలిసి హైదరాబాద్ లోని మంత్రి నివాసంలో కలిసి పుష్ప గుచ్చం అందించి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం శాసన మండలి చైర్మన్ భూపాల్ రెడ్డి, మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి లను కలిసి ధన్యవాదాలు తెలిపారు.

 

సమిష్టి సహకారం తో పటాన్చెరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుని వెళుతున్నట్లు తెలిపారు. 250 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 270 పడకలతో ఏర్పాటు కాబోతున్న మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో పేద ప్రజలకు అత్యాధునిక వైద్యం అందుబాటులోకి రానున్నట్టు ఆయన తెలిపారు.

 

ఇప్పటికే ఆసుపత్రికి సంబంధించిన స్థలం సంబంధిత శాఖకు బదిలీ అయినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, జడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, ఎంపీపీ దేవానందం, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మున్సిపల్ వైస్ చైర్మన్లు నరసింహ గౌడ్, రాములు గౌడ్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, వెంకట్ రెడ్డి, ఆదర్శ రెడ్డి, నగేష్ యాదవ్, విజయ్ కుమార్, బాల్ రెడ్డి, విజయ భాస్కర్ రెడ్డి, వెంకటేష్ గౌడ్, మాజీ ఎంపీపీలు శ్రీశైలం యాదవ్, యాదగిరి యాదవ్, పాండు, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

Ramesh

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

7 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

7 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

7 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

7 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago