హామీ ఇచ్చారు..అండగా నిలిచారు
అగర్వాల్ పరిశ్రమలో మృతి చెందిన కార్మికుడి కుటుంబానికి 60 లక్షల రూపాయల నష్టపరిహారం చెక్కులు అందజేత
యాజమాన్యంతో చర్చించి మెరుగైన నష్టపరిహారం
కృతజ్ఞతలు తెలిపిన మృతుడి కుటుంబ సభ్యులు
ప్రతి పరిశ్రమ భద్రత ప్రమాణాలు పాటించాలి
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
హామీ ఇస్తే అమలు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్న పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి గారు.. ప్రమాదవశాత్తు మృతి చెందిన కార్మికుడి కుటుంబానికి అండగా నిలిచి వారి భవిష్యత్తుకు ఆర్థిక భరోసా కల్పించారు. గత నెల రోజుల క్రితం..బీహార్ రాష్ట్రానికి చెందిన సురేష్ సింగ్ యాదవ్ (34) పటాన్చెరు డివిజన్ పరిధిలోని అగర్వాల్ రబ్బర్స్ పరిశ్రమలో కాంటాక్ట్ కార్మికుడిగా పనిచేస్తూ విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మృతి చెందాడు. మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ స్థానిక కార్మికులు, కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే జిఎంఆర్ ను ఆశ్రయించారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే జిఎంఆర్.. పరిశ్రమ యాజమాన్యంతో చర్చించి 65 లక్షల రూపాయల నష్టపరిహారం అందించేలా ఒప్పించారు. అనంతరం బంధువుల సమక్షంలో పరిశ్రమ ప్రతినిధులతో అంగీకార పత్రాన్ని అందించారు.ఒప్పందానికి అనుగుణంగా.. గురువారం సాయంత్రం పటాన్చెరు లోని క్యాంపు కార్యాలయంలో పరిశ్రమ ప్రతినిధులు, కార్మిక సంఘాల ప్రతినిధులు, ఇతర భారతీయ సంక్షేమ సంఘం ప్రతినిధుల సమక్షంలో ఎమ్మెల్యే జిఎంఆర్ చేతులమీదుగా.. మృతుడి కుటుంబ సభ్యులకు 60 లక్షల రూపాయల నష్టపరిహారం చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ.. ప్రతి పరిశ్రమ భద్రత ప్రమాణాలను పాటిస్తూ.. కార్మికుల భద్రతకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. సేఫ్టీ నిబంధనలు పాటించకుండా పరిశ్రమల యాజమాన్యాలు కార్మికుల జీవితాలను ప్రమాదాల్లోకి నెట్టి వేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిశ్రమలలో పనిచేస్తున్న క్యాజువల్, కాంట్రాక్ట్ కార్మికులకు పని ప్రదేశాల వద్ద పూర్తి స్థాయి భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. నర్శపరిహారం డబ్బుని మృతుని భార్యతో పాటు.. వారి పిల్లల పేర్లపై ఫిక్స్డ్ డిపాజిట్లు చేసి వారి భవిష్యత్తుకు భరోసా అందిస్తున్నామని తెలిపారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…