పటాన్చెరు
క్రిస్మస్ పర్వదినం పురస్కరించుకొని పటాన్చెరు, రామచంద్రాపురం, భారతి నగర్ డివిజన్ పరిధిలోని చర్చిలలో నిర్వహించిన ప్రార్థనల్లో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఏసుక్రీస్తు జీవిత చరిత్రను, ఆయన గొప్పతనాన్ని కళాకారులు తమ పాటల ద్వారా తెలియజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రిస్మస్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున నిరుపేద క్రిస్టియన్ కుటుంబాలకు బట్టలు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ప్రతి ఒక్కరూ క్రిస్మస్ పర్వదినాన్ని ఆనందంగా నిర్వహించుకోవాలని అభిలాషించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మెట్టు కుమార్ యాదవ్, సింధు ఆదర్శ్ రెడ్డి, పుష్ప నగేష్, మాజీ కార్పొరేటర్ అంజయ్య, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఆదర్శ్ రెడ్డి, విజయ్ కుమార్, పృథ్వి రాజ్, పాస్టర్లు, తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…