Telangana

జాతిపితకు ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతిని పురస్కరించుకొని పటాన్చెరు పట్టణంలోని గాంధీ థీమ్ పార్కులో గల గాంధీ మహాత్ముడి కాంస్య విగ్రహానికి పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. అహింస అనే ఆయుధంతో ఆంగ్లేయులను తరిమికొట్టిన మహోన్నత వ్యక్తి మహాత్మా గాంధీ అని కొనియాడారు. మహనీయులు భౌతికంగా గతించినప్పటికిని వారు చూపిన మార్గం, అనుసరించిన విలువలు ప్రతి ఒక్కరికి స్ఫూర్తి ప్రదాయకంగా నిలుస్తాయని అన్నారు. నేటికీ ప్రపంచంలోని ప్రతి దేశంలో గాంధీ చూపిన మార్గాన్ని అనుసరిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయకుమార్, బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్జల్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

9 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

9 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

9 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

9 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

9 hours ago