మహాలక్ష్మితో మహిళల జీవితాల్లో కొత్త వెలుగులు
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం మహిళల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతోందని పటాన్చెరువు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. బుధవారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని మండల పరిషత్ కార్యాలయంలో మహాలక్ష్మి పథకం లబ్ధిదారులకు సబ్సిడీ గ్యాస్ ప్రొసీడింగ్ పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రకటించిన ఆరు గ్యారంటీలలో భాగంగా అర్హులైన ప్రతి కుటుంబానికి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందించడం జరుగుతుందని తెలిపారు. నియోజకవర్గం వ్యాప్తంగా 35 వేల మంది లబ్ధిదారులకు సబ్సిడీ అందించడం జరుగుతోందని తెలిపారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్లు మెట్టు కుమార్ యాదవ్, సింధు ఆదర్శ్ రెడ్డి, పుష్ప నగేష్, ప్రత్యేక అధికారి దేవూజ, ఎమ్మార్వో రంగారావు, ఎంపీడీవో యాదగిరి, జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ సురేష్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాజు, తదితరులు పాల్గొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…