_80 మంది జర్నలిస్టులకు 50 లక్షల రూపాయలతో హెల్త్ ఇన్సూరెన్స్
_జర్నలిస్టుల సంక్షేమానికి ఎల్లప్పుడూ సంపూర్ణ సహకారం
మనవార్తలు ,పటాన్ చెరు:
పటాన్చెరు నియోజకవర్గ జర్నలిస్టులకు ఎమ్మెల్యే జిఎంఆర్ తన పుట్టినరోజున అపూర్వ కానుకను అందజేశారు.ప్రభుత్వానికి ప్రజలకు వారిదిగా నిలుస్తూ.. అనునిత్యం ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయడంతో పాటు ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభంగా పేరుందిన జర్నలిస్టుల ఆరోగ్య భద్రత కోసం.. హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులు అందించే ప్రక్రియ ప్రారంభించారు.పటాన్చెరు నియోజకవర్గ పరిధిలో వివిధ పత్రికలు, చానళ్లలో విధులు నిర్వహిస్తున్న 80 మంది పాత్రికేయులకు 50 లక్షల రూపాయల వ్యయంతో హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులను అందించారు.
సోమవారం తన పుట్టినరోజు సందర్భంగా పటాన్చెరు పట్టణంలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో జర్నలిస్టుల సోదరులకు వీటిని అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ జర్నలిస్టులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ జర్నలిస్టుల సంక్షేమం కోసం మొట్టమొదటిసారిగా 100 కోట్ల రూపాయలతో సంక్షేమ నిధిని ఏర్పాటు చేయడం జరిగిందని గుర్తు చేశారు.నియోజకవర్గంలో పనిచేస్తున్న జర్నలిస్టుల సంక్షేమానికి ఎల్లప్పుడూ తాను అండగా ఉంటానని తెలిపారు. మూడు సంవత్సరాల పాటు సంవత్సరానికి 15 లక్షల రూపాయల చొప్పున హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులను అందిస్తున్నామని తెలిపారు.
పటాన్చెరు నియోజకవర్గ అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లడంలో జర్నలిస్టుల పాత్ర క్రియాశీలకమని అన్నారు. నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తూ వారి సమస్యల పరిష్కారంలో సైతం ముందుంటున్నారని అభినందించారు.నియోజకవర్గ జర్నలిస్టుల ఆరోగ్య భద్రత కోసం కోసం ఎమ్మెల్యే జిఎంఆర్ హెల్త్ ఇన్సూరెన్స్ చేయించడం పట్ల జర్నలిస్టులు ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్భంగా నియోజకవర్గ జర్నలిస్టులు ఎమ్మెల్యే జిఎంఆర్ ను పూలమాలలు, శాలువలు, జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, పటాన్చెరు కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, టిఆర్ఎస్ కార్మికు విభాగం రాష్ట్ర కార్యదర్శి యాదగిరి యాదవ్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, శ్రీధర్ చారి, వంగరి అశోక్, మెరాజ్ ఖాన్, నియోజకవర్గ జర్నలిస్టులు పాల్గొన్నారు.
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…