భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోండి
ఇస్నాపూర్లో ప్రభుత్వ ట్రామా కేర్ ఏర్పాటు చేయండి
అసంఘటితరంగ కార్మికులకు ప్రమాద బీమా కల్పించండి
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
సిగాచి పరిశ్రమ దుర్ఘటనను ఒక గుణపాఠంగా తీసుకుని రాబోయే రోజుల్లో పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని ఫార్మా, కెమికల్ పరిశ్రమల్లో ప్రమాదాలు చోటు చేసుకోకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని పరిశ్రమలలో పనిచేస్తున్న అసంఘటితరంగ కార్మికులకు 50 లక్షల రూపాయల ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కోరారు.మంగళవారం సిగాచి పరిశ్రమను సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు వివేక్, దామోదర రాజనర్సింహ, పొంగులేటి సుధాకర్ రెడ్డి, దుద్దిల్ల శ్రీధర్ బాబు లతో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ సందర్శించారు. దుర్ఘటన జరిగిన పరిశ్రమలోని వివిధ విభాగాలను స్వయంగా పరిశీలించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ పలు అంశాలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.
పటాన్‌చెరులో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సిద్ధం అవుతున్నప్పటికీని ఇస్నాపూర్ లో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రభుత్వ ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు. ట్రామా కేర్ ద్వారా ప్రమాదం చోటు చేసుకున్న వెంటనే సత్వర వైద్యం అందించగలుగుతామని తెలిపారు.అదే విధంగా దేశంలోని వివిధ రాష్ట్రాల కు చెందిన నిరుపేద ప్రజలు పొట్టకూటి కోసం స్థానిక పరిశ్రమలలో దినసరి కూలీలుగా పనిచేస్తున్నారని వారికోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడంతో పాటు 50 లక్షల రూపాయల ప్రమాద బీమా సౌకర్యాన్ని అందించేలా. యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు.అనంతరం పటాన్చెరువు పట్టణంలోని ధ్రువ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్మికులను పరామర్శించారు.
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…