PATANCHERU
పట్టణ ప్రగతిని ప్రారంభించిన ఎమ్మెల్యే…
హైదరాబాద్:
పట్టణ ప్రాంతాల సమగ్ర వికాసమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మూడో విడత పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా పటాన్చెరు డివిజన్ పరిధిలోని బ్లాక్ ఆఫీస్ ప్రాంగణంలో చేపట్టిన పారిశుద్ధ్య కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. అనంతరం పట్టణ ప్రగతి కార్యక్రమం కోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన వాహనాలను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టణ ప్రగతి, హరిత హరం, పల్లె ప్రగతి కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని కోరారు.
పది రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమాల్లో ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలని సూచించారు. ఈ సంవత్సరం దళితుల సాధికారికత కోసం రెండు రోజులు కేటాయించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ బాలయ్య, టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్జల్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నర్సింహారెడ్డి, ప్రమోద్ గౌడ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…