పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి :
ఇటీవల ఉగాండా దేశంలోని కంపాలలో జరిగిన వరల్డ్ టెన్నిస్ టూర్ ( ఐటీఎఫ్ ) జూనియర్ సర్క్యూట్ (జే30) అండర్ 18 డబుల్స్ విభాగంలో విజేతగా, సింగిల్స్ విభాగంలో రన్నర్ గా నిలిచిన నూకల షన్వితా రెడ్డిని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అభినందించారు. సోమవారం పటాన్చెరు పట్టణంలోని తన నివాసంలో షన్వితా రెడ్డికి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టను ప్రపంచ వేదికపై ఇనుమడింపచేయడం గర్వకారణమన్నారు. భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో షన్విత రెడ్డి తండ్రి పటాన్చెరు సిఐ నూకల వేణుగోపాల్ రెడ్డి పాల్గొన్నారు.
గీతం కార్యశాల ప్రారంభోత్సవంలో ఐఐటీ భువనేశ్వర్ ప్రొఫెసర్ ఆశాభావం పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : భారతదేశం ప్రపంచ సెమీకండక్టర్…
గీతం ఆతిథ్య ఉపన్యాసంలో పేర్కొన్న మాజీ ప్రొఫెసర్ సి.రాఘవేంద్రరావు పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : రాబోయే మూడు దశాబ్దాలు…
శేరిలింగంపల్లి ,మనవార్తలు ప్రతినిధి : పోలీసుల సేవలు మరువలేనివనీ కృష్ణ మూర్తి ఫౌండేషన్ చైర్మన్ కంజర్లకృష్ణ మూర్తి చారి అన్నారు.…
శేరిలింగంపల్లి ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణలో ఉప ఎన్నికలు జరుగుతున్న జూబ్లీహిల్స్ నియోజకవర్గం హాట్ టాపిక్ గా మారింది.హైదరాబాద్ జిల్లా…
19 మంది లబ్ధిదారులకు 7 లక్షల 22 వేల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ పటాన్ చెరు ,మనవార్తలు…
అతి త్వరలో శాశ్వత ప్రాతిపాదికన పాలిటెక్నిక్ కళాశాల భవనం పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పటాన్ చెరు…