Telangana

గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే జిఎంఆర్

ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు..

అభివృద్ధికి చిరునామా పటాన్‌చెరు

అంగరంగ వైభవంగా సాంస్కృతిక కార్యక్రమాలు 

77 మీటర్ల జాతీయ జెండాతో మార్చ్ ఫాస్ట్

4 లక్షల 40 వేల రూపాయల సొంత నిధులచే నగదు బహుమతులు పంపిణీ..

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వ సహకారం..ప్రజల అండదండలతో పటాన్చెరు నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నామని పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. 77వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని పటాన్‌చెరు డివిజన్ పరిధిలో ఏర్పాటుచేసిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే జిఎంఆర్ పాల్గొన్నారు. జిహెచ్ఎంసి, మైత్రి మైదానం, ఎంపీడీవో, ఎమ్మార్వో, ముదిరాజ్ భవన్ తో పాటు వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మైత్రి మైదానంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ  మినీ ఇండియాగా పేరుందిన పటాన్‌చెరు నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని తెలిపారు. వివిధ రాష్ట్రాల నుండి ఉపాధి కోసం వచ్చిన ప్రతి ఒక్కరిని కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నామని తెలిపారు.రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లక్ష్యాలను సాధిస్తున్నామని తెలిపారు.

ఈ సందర్భంగా అశ్వాలతో కలిసి 77 మీటర్ల జాతీయ జెండాతో నిర్వహించిన మార్చి ఫాస్ట్ అందర్నీ అలరించింది. అనంతరం నియోజకవర్గ పరిధిలోని వివిధ పాఠశాలల విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, మార్చ్ ఫాస్ట్ అందరినీ అలరించాయి. వివిధ అంశాల్లో విజేతలుగా నిలిచిన పాఠశాలలకు ప్రథమ బహుమతి 20 వేల రూపాయలు, ద్వితీయ బహుమతి 15 వేల రూపాయలు, తృతీయ బహుమతి 10 వేల రూపాయలు, పోటీలో పాల్గొన్న ప్రతి పాఠశాలకు 5000 రూపాయల చొప్పున 4 లక్షల 40 వేల రూపాయలు అందజేశారు. ఈ కార్యక్రమాల్లో పటాన్‌చెరు కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మాజీ జెడ్పిటిసి జైపాల్, మాజీ కార్పొరేటర్ సపానదేవ్,తహసిల్దార్ హరి బాబు, ఎంపీడీవో యాదగిరి, డీఎస్పీ ప్రభాకర్, జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ జ్యోతి రెడ్డి, ఎంఈఓలు నాగేశ్వరరావు నాయక్, రాథోడ, సీఐ వినాయక్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, గూడెం మధుసూదన్ రెడ్డి, పట్టణ పుర ప్రముఖులు, తదితరులు పాల్గొన్నారు.

 

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago