Telangana

క్రీడల అభివృద్ధికి సంపూర్ణ సహకారం _ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరులో ఘనంగా ముగిసిన 36వ మైత్రి ఇన్విటేషన్ క్రికెట్ టోర్నమెంట్

విజేతగా నిలిచిన ఎస్సార్ గ్రూపు జట్టు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

బాల్యం నుండే క్రీడల పై ఆసక్తి పెంపొందించుకోవడం మూలంగా మానసిక ధైర్యం, శారీరక దృఢత్వం లభిస్తుందని, నియోజకవర్గంలో క్రీడల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని మైత్రి మైదానంలో మైత్రి క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో గత తొమ్మిది రోజులగా నిర్వహిస్తున్న 36వ మైత్రి ఇన్విటేషన్ క్రికెట్ టోర్నమెంట్ ముగింపు వేడుకలు ఆదివారం సాయంత్రం ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమానికి పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంజిరెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరై విజేతలకు నగదు బహుమతి, ట్రోఫీలను అందజేశారు.

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దశాబ్దాల చరిత్ర గలిగిన మైత్రి క్రీడా మైదానం రాష్ట్ర, జాతీయ క్రీడలకు వేదికగా నిలిచిందని తెలిపారు. ఎంతో మంది క్రీడాకారులు ఇదే మైదానంలో శిక్షణ పొంది జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించారని గుర్తు చేశారు. పటాన్‌చెరులో క్రికెట్ అభివృద్ధికి మైత్రి క్రికెట్ క్లబ్ అందిస్తున్న సేవలను ఆయన ప్రశంసించారు. క్రీడలపై ఆసక్తి ప్రతిభ కలిగిన పేద క్రీడాకారులకు ఆర్థిక సాయం అందించడంతోపాటు వారి అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని తెలిపారు. నియోజకవర్గం వ్యాప్తంగా మినీ స్టేడియాలు నిర్మిస్తూ ప్రతి ఒక్కరిలో క్రీడలపై ఆసక్తిని పెంపొందిస్తున్నామని తెలిపారు. గత సంవత్సర కాలంగా మైత్రి స్టేడియం వేదికగా రాష్ట్ర జాతీయ క్రీడలు నిర్వహిస్తున్నామని గుర్తు చేశారు. అతి త్వరలో జాతీయస్థాయి మహిళా కబడ్డీ పోటీలు సైతం నిర్వహించబోతున్నట్లు తెలిపారు.అనంతరం విజేతగా నిలిచిన ఎస్సార్ గ్రూప్, రన్నర్ గా నిలిచిన వన్ ఛాంపియన్ జట్లకు లక్ష రూపాయల నగదు బహుమతుల తో పాటు ట్రోఫీలను అందజేశారు.

ఈ కార్యక్రమంలో పటాన్‌చెరు కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మాజీ కార్పొరేటర్లు శంకర్ యాదవ్, సపానదేవ్, బిజెపి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి, మైత్రి క్రికెట్ క్లబ్ అధ్యక్షులు హనుమంత్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గిరి, సీనియర్ నాయకులు ప్రకాష్ రావు, గూడెం మధుసూదన్ రెడ్డి, శ్రీధర్ చారి, పృథ్వి రాజ్, రాజన్ సింగ్, అశోక్, మల్లేష్ యాదవ్, క్రీడాకారులు పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago